మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - May 29, 2020 , 23:39:56

పండుగలా ఎవుసం చేద్దాం

పండుగలా ఎవుసం చేద్దాం

వికారాబాద్‌ : రైతుల బాగు కోసమే సీఎం కేసీఆర్‌ తపన పడుతున్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. మండలంలోని గొట్టిముక్కుల గ్రామంలో రైతు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ ఏరువాక వస్తే పండుగ చేసుకునేవాళ్లం అని ఇప్పుడు మళ్లీ ఆ పరిస్థితులు రావాలని ప్రభుత్వం చూస్తున్నదని పేర్కొన్నా రు. కాళేశ్వరం ప్రాజెక్టుతో అపర భగీరథ ప్రయత్నం చేశారన్నారు. కొర్రలు తదితర వాటికి బాగా డిమాండ్‌ ఉందని, ఆ దిశగా వాటితో పాటు తెలంగాణ సోనాకు కూడా మన ప్రాం తంలో మంచి అవకాశం ఉందన్నారు. 5వేల రైతులకు ఒక ఏఈవో క్లస్టర్‌గా ఇప్పటికే ఏర్పాటు చేశారన్నారు. గొట్టిముక్కల పాఠశాలలో ఇంగ్లిష్‌ మీడియం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమం లో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, వి ద్యా మౌలిక వసతుల కల్పన సంస్థ చైర్మన్‌ నాగేందర్‌గౌడ్‌, డీఈవో గోపాల్‌, జడ్పీటీసీ ప్రమోదినిరెడ్డి, ఎంపీపీ చంద్రకళ, ఎంపీడీవో సుభాషిణి, ఏవో ప్రసన్నలక్ష్మి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి ఉన్నారు. 

దేశానికి అన్నం పెట్టే దిశగా రైతులు ఎదుగాలి

చేవెళ్ల : రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సబితారెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి తెలిపారు. శుక్రవారం చేవెళ్ల మండలం ఆలూరులో పంటలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రి సబితారెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షుడు ఒంగేటి లక్ష్మారెడ్డి, జిల్లా వ్యవసాయా ధికారి గీతారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ రావాలంటే రైతు పండించిన పం టలకు రైతే ధర నిర్ణయించే స్థాయికి ఎదుగాలని అన్నారు. అందుకు మక్కజొన్న పంటకు బదులుగా ప్రభుత్వం నిర్దేశించిన పత్తి, కం దులు, పువ్వులు, కూరగాయలు, సన్నరకం వరి సాగుచేయాలని సూచించారు.  రైతుల బాగు కోసమే పంటల మార్పిడి చేసుకోవాలని ప్రభుత్వ తపన అని సూచించారు.  దేశంలో మొత్తం మీద రాష్ట్రంలో రైతులు పండించిన పత్తి పంటకు డిమాండ్‌ ఉందన్నారు. కంది పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్స్‌ను కూడా జిల్లాలో ఒకచోట 500 ఎకరాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందన్నారు. దేశానికి అన్నం పెట్టే దిశగా తెలంగాణ రైతులు ఎదుగాలన్నారు. రైతన్నలకు కేసీఆర్‌ వెన్నెముకలాంటి వారని.. అందుకు వారికి 24గంటల విద్యుత్‌ను ఇచ్చి వారికి భరోసా కల్పించిందని చెప్పారు. ఎమ్మెల్యే యాద య్య మాట్లాడుతూ.. డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేస్తే రైతులు అభివృద్ధి చెందుతారన్నారు. అందుకు ప్రభుత్వం రైతు సదస్సులు నిర్వహించి పంటమార్పిడి చేయాలని సూచిస్తున్నదన్నారు. 

గ్రామంలో నిర్వహించిన సదస్సుకు రైతులు రాకపోవడంతో మంత్రి సబితారెడ్డి వ్యవసాయ అధికారులు, ఆలూరు ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సమాచారం ఇచ్చినా ఉపాధి హామీ పనులకు వెళ్లారని సర్పంచ్‌ తెలిపారు. వెంటనే రైతులను తీసుకురావాలని ఆదేశించడంతో.. గ్రామంలోకి హుటాహుటిన వెళ్లి రైతులను తీసుకొచ్చే ప్రయ త్నం చేశారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ సభ్యురాలు మాలతి, మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ అరుణ, మండల అధ్యక్షుడు ప్రభాకర్‌, రైతు బంధు సమితి అధ్యక్షుడు రాంరెడ్డి, వైస్‌ ఎంపీపీ ప్రసాద్‌, మాజీ ఎంపీపీ బాలరాజు, ఎంపీటీసీ రవీందర్‌రెడ్డి ఉన్నారు.

మున్సిపాలిటీల బలోపేతానికి సీఎం కృషి

శంకర్‌పల్లి : మున్సిపాలిటీల బలోపేతానికి సీఎం కేసీఆర్‌ ఎం తో కృషి చేస్తున్నారని సబితాఇంద్రారెడ్డి అన్నారు. శంకర్‌పల్లి మున్సిపాలిటీకి ప్రభుత్వం నుంచి మంజూరైన రెండు ట్రాక్టర్లను ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి అధికారులకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీ ణ ప్రాంతాలు కూడా పట్టణాలుగా మారి అభివృద్ధి చెందడానికి నాలుగైదు గ్రామాలను కలిపి కొత్త మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేశారన్నారు. 75 చదరపు గజాల స్థలం ఉంటే ఆ వ్యక్తి మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇల్లు నిర్మించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, వైస్‌ చైర్మ న్‌ వెంకట్‌రాంరెడ్డి, కమిషనర్‌ జైత్‌రామ్‌, శంకర్‌పల్లి ఏఎంసీ చైర్మన్‌ రాజునాయక్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ శశిధర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు, గుడిమల్కాపూర్‌ ఏఎంసీ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, తహసీల్దార్‌ కృష్ణకుమార్‌, గుడిమల్కాపూర్‌ ఏఎంసీ డైరెక్టర్‌ అనంత్‌రెడ్డి, కౌన్సిలర్లు చంద్రమౌళి, శ్రీనాథ్‌గౌడ్‌, అశోక్‌, రాములు, శ్వేత, వాణి, రాధ, లక్ష్మమ్మ, నాయకులు అశోక్‌కుమార్‌, గోపాల్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, మాణిక్‌రెడ్డి  పాల్గొన్నారు. 

సైన్స్‌ల్యాబ్‌ నిర్మాణ పనులను ప్రారంభించిన మంత్రి 

పరిగి : మండల పరిధిలోని గడిసింగాపూర్‌ గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో రూ.9లక్షలతో సైన్స్‌ల్యాబ్‌ నిర్మాణ పనులను శుక్రవారం ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. 

పాలమూరు ఎత్తిపోతలు పూర్తి చేస్తాం

పరిగి : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడం ద్వారా జిల్లా సస్యశ్యామలానికి సీఎం కేసీఆర్‌ కృషి సల్పుతున్నారని మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను చేపడుతుం దన్నారు. కాళేశ్వరం పనులు దాదాపు పూర్తికావచ్చాయని, పాలమూరు ఎత్తిపోతలను వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నదన్నారు. పరిగి మండలం గడిసింగాపూర్‌లో నూతన వ్యవసాయ విధానంపై జరిగిన అవగాహన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుతో 8నుంచి 9 ఉమ్మడి జిల్లాలకు సాగునీరు అందుతుందని, పాలమూరు ఎత్తిపోతల పనులు సాధ్యమైనంత త్వరగా చేపట్టేందుకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు.  రాష్ట్రవ్యాప్తంగా తాండూరు కందిపప్పుకు మంచి పేరు ఉం దని, వికారాబాద్‌ జిల్లా బ్రాండ్‌ ఇమేజ్‌ కొనసాగాలంటే జిల్లా లో అధిక విస్తీర్ణంలో కంది పంట సాగు చేయాల్సిందిగా మం త్రి రైతులకు సూచించారు.

 పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు సూచించిన మేర కు పంటలను సాగు చేయడం ద్వారా రైతులు మంచి ఉత్పత్తులు సాధించడంతో పాటు చక్కటి ధర పొందాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ విజయ్‌కుమార్‌, జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌, ఎంపీపీ కె. అరవిందరావు, జడ్పీటీసీ బి.హరిప్రియ, పీఏసీఎస్‌ చైర్మన్‌ కె. శ్యాంసుందర్‌రెడ్డి, ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు. 


logo