మంగళవారం 04 ఆగస్టు 2020
Vikarabad - May 29, 2020 , 23:39:52

కందిపప్పు పంపిణీకిశ్రీకారం

కందిపప్పు పంపిణీకిశ్రీకారం

కందిపప్పు కూడా అందజేయాలని గతంలోనే నిర్ణయించింది. ఒక్కో కార్డుదారునికి రెండు కిలోల కందిపప్పును ఉచితంగా జూన్‌ 1నుంచి అందజేయనుంది. ఇప్పటికే జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న రేషన్‌ షాపులకు కందిపప్పు ను తరలించారు. లాక్‌డౌన్‌ పొడిగింపుతో ఈ నెలలోనే కందిపప్పు అందించేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక రూపొందించినప్పటికీ పంపిణీలో ఆలస్యమైంది. పేద కుటుంబాలకు సాంత్వన కలిగేలా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రెండు నెలల నుంచి కార్డుదారులందరికీ రెండింతల బియ్యాన్ని, రూ. 1500 ల నగదు చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నది. ఇదే మాదిరిగా వచ్చే నెలలో కూడా బియ్యంతో పాటు కందిపప్పును ఇవ్వనుంది. ఈ క్రమంలో జిల్లాలో మరో నాలుగు రోజుల్లో కందిపప్పు పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. జిల్లాకు 1048 మెట్రిక్‌ టన్నుల కందిపప్పును ప్రభుత్వం కేటాయించగా.. ఈ మొత్తా న్ని నల్గొం డ జిల్లా మిర్యాలగూడలో నిల్వ చేశారు. ఇక్కడి నుంచి ఆయా జిల్లాలకు చేరవేయాల్సి ఉండడంతో పంపిణీలో ఆలస్యం జరిగింది. అక్కడి గోదాములకు దగ్గరగా ఉన్న జిల్లాలకు పప్పు సరఫరాలో మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. దగ్గర విషయంలో రంగారెడ్డి జిల్లా ఏడో స్థానంలో ఉండడంతో ఆలస్యం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లాకు సరఫరా అయ్యే కందిపప్పు ఈ నెల 15 తర్వాత నుంచి మన జిల్లా గోదాములకు చేరుకున్నాయి. ఆ వెంటనే మండల స్థాయిలోని గోదాములకు, అక్కడి నుంచి రేష న్‌ దుకాణాలకు చేర్చి కార్డుదారులకు అందజేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో జిల్లాలో 5లక్షల 24వేల 868 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. 

రేషన్‌ పంపిణీ జోరు..

జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌ బియ్యం పంపిణీ జోరుగా సాగుతున్నది. దీనికోసం పౌరసరఫరాలశాఖ ద్వారా ఉచిత బియ్యం, డబ్బులను పంపిణీ చేసింది. ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించిన బియ్యం స్టాక్‌తోపాటు నగదును కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే పేదల కోసం పౌర సరఫరాల శాఖ అకౌంట్‌లో జమచేసింది. 

నెల ఖర్చుకు రూ.1500

ఉచితంగా బియ్యం ఇవ్వడమే కాకుండా నిత్యావసర వస్తువులు, నెలవారీ కూరగాయలు ఇతర ఆహార పదార్ధాల కోసం ప్రతి కార్డుపై రూ.1500 రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. వలస కూలీలకు కూడా 500 రూపాయలు ఇచ్చి ఆదుకుంది. 

కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కరువు అలుముకున్నప్పటికీ జిల్లాలో తిండికి తిప్పలు లేకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్య లు చేపట్టగా జిల్లా పౌరసరఫరాలశాఖ పంపిణీ చేసింది. జిల్లాలో ఏ ఒక్క పేద కుటుంబం కూడా ఆకలి బాధతో విలవిలలాడవద్దనే సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుని విజయవంతంగా కొనసాగిస్తున్నది.

పంపిణీ ఇలా..

లబ్ధిదారుల కార్డులు 

మెట్రిక్‌ టన్నుల్లో..

జిల్లాలో మొత్తం రేషన్‌ షాపులు : 919

అవసరమున్న బియ్యం 21,567.097

మొత్తం కార్డులు : 5,24,882

ఇచ్చిన బియ్యం 2,248.461 

పంపిణీ చేసిన బియ్యం : 5,06,352

మొత్తం బియ్యం : 23,815.558

ఇంకా పంపిణీ చేయాల్సింది : 18,530

పంపిణీ చేసిన బియ్యం : 21,524.690

పంపిణీ శాతం : 96.47

ఇంకా పంపిణీ చేయాల్సింది : 2,290.868

నగదు చెల్లింపులు 

మొత్తం కార్డులు : 5,24,887        

పోస్టాఫీస్‌ ద్వారా : 32,360 కార్డులకు చెల్లింపులు 

మూడు నెలల పాటు బియ్యం తీసుకోనివారు : 76290

బ్యాంకుల ద్వారా : 4,16,237 కార్డుల లబ్ధిదారులు


logo