మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - May 27, 2020 , 23:09:04

అవగాహనతో‘సాగు’దాం

అవగాహనతో‘సాగు’దాం

  • డిమాండ్‌ ఉన్న పంటలే వేయాలి
  • గ్రామసభల్లో  ఎమ్మెల్యేలు 
  • ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ముమ్మరంగా సదస్సులు
  •  పంటలపై సమాచారమిచ్చేందుకు గ్రామాలబాట పట్టిన అధికారులు  

కులకచర్ల : వానకాలంలో రైతులు  ప్రభుత్వం సూ చించిన పంటలు వేయాలని పరిగి ఎమ్మెల్యే కొప్పు ల మహేశ్‌రెడ్డి అన్నారు. బుధవారం కులకచర్ల మండల కేంద్రంలో సర్పంచ్‌ సౌమ్యావెంకట్‌రాంరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో డీసీసీబీ  అధ్యక్షుడు బుయ్యని మనోహర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు.  రైతులు లాభసాటి వ్యవసాయం చేస్తేనే అభివృద్ధి చెందుతారన్నా రు.  సీఎం కేసీఆర్‌ ఏఏ పొలాల్లో ఏఏ పంటలు పండుతాయో వ్యవసాయశాఖ అధికారులతో సర్వే చేయించారన్నారు. ముఖ్యంగా జొన్న, రాగులు, పొద్దుతిరుగు పంట, సన్నజాతి వరి, నల్లరేగడి పొ లాల్లో పత్తి, మిర్చి పంటలు వేయాలని రైతులకు సూచించారు. రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు పీరంపల్లి రాజు, కులకచర్ల ఎంపీపీ సత్యమ్మహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్‌నాయక్‌, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ నాగరాజు, వైస్‌ ఎంపీపీ రాజశేఖర్‌గౌడ్‌ పాల్గొన్నారు. 

ప్రభుత్వం సూచించిన పంటలే వేయాలి

మర్పల్లి : మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలే వేయాలని, రైతులు అధిక దిగుబడులతో పాటు లాభాలు వచ్చే పంటల ను సాగు చేయాలని వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ అన్నారు. పెద్దాపూర్‌ గ్రామంలో వ్యవసాయాధికారుల ఆధ్వర్యంలో రైతులకు పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆదాయానికి వ్యవసాయమే ప్రధా నం అన్నారు. ప్రభుత్వం సూచించిన పంటలను వేసి రైతులు అధిక దిగుబడులు పొందాలన్నారు.  కార్యక్రమంలో ఏడీ వినోద్‌కుమార్‌, ఏవో వసంత, ఏఈవోలు మహేశ్‌, ప్రశాంత్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. 

మొక్కజొన్న సాగు చేయవద్దు

ఆమనగల్లు : వ్యవసాయంలో నూతన ఒరవడిని సృష్టించేందుకు సీఎం కేసీఆర్‌ పలు సంస్కరణలు తీసుకొస్తున్నారని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ పేర్కొన్నారు.  బుధవారం శెట్టిపల్లిలో  రైతుబంధు సమి తి  మండల అధ్యక్షుడు పోనుగోటి అర్జున్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే, ఏఓ అరుణకుమారి, మండల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు వానకాలం సాగులో ప్రభుత్వ సూచనలు పాటించి సాగు చేస్తే పంట దిగుబడి, గిట్టుబాటు ధర వస్తుందన్నారు. వానకాలంలో మక్కజొన్న పంటను సాగు చేయవద్దని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్‌ గంప వెంకటేశ్‌, జడ్పీటీసీ అనురాధ, వైస్‌ఎంపీపీ అనంతరెడ్డి, సర్పంచ్‌ గోదాదేవి, ఎంపీటీసీ నిట్టమంగమ్మ, నారాయణ, అధికారు లు ముత్యాలు, శివతేజ, సాయిరాం పాల్గొన్నారు.


logo