బుధవారం 05 ఆగస్టు 2020
Vikarabad - May 27, 2020 , 23:05:13

జిల్లాలో ఈ-డాక్టర్స్‌ లాగిన్‌ సేవలు

జిల్లాలో ఈ-డాక్టర్స్‌ లాగిన్‌ సేవలు

వికారాబాద్‌ : గ్రామీణ పౌరులకు టెలి మెడిసిన్‌ సేవలు అందించడం అభినందనీయమని ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఎంపీ తన కార్యాలయంలో ఈ-డాక్టర్స్‌ లాగిన్‌ ప్రాజెక్టు పోస్టర్‌ను ఆవిష్కరించి వివరాలను ప్రాజెక్టు సభ్యులకు అడిగి తెలుసుకున్నారు. మొదటి దశలో ఈ డాక్టర్స్‌ లాగిన్‌ ప్రాజెక్టును వికారాబాద్‌ జిల్లాలో చేపట్టడం జరుగుతుందని ప్రాజెక్టు సభ్యులు ఎంపీకి వివరించారు. దీని కింద జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలకు టెలి మెడిసిన్‌ సౌకర్యం కల్పించి గ్రామీణ పౌరులకు సేవలు సులభంగా అందుతాయని ప్రాజెక్టు సభ్యులు తెలిపారు. ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ పౌరులకు టెలి మెడిసిన్‌ అందించాలనే లక్ష్యంతో ఈ డాక్టర్స్‌ లాగిన్‌ ప్రాజెక్టును జిల్లాలో చేపట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో టీటా అధ్యక్షుడు సందీప్‌కుమార్‌, టీటా సభ్యులు రాజేందర్‌ షేరీ, వివేక్‌ పాల్గొన్నారు. 


logo