ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - May 27, 2020 , 23:05:10

పేదలకు వరం.. ప్రభుత్వ పథకాలు

పేదలకు వరం.. ప్రభుత్వ పథకాలు

  • ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం
  • ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌
  • ఆమనగల్లు మండలంలోని 96 మందికి 
  • కల్యాణలక్ష్మి, ఇద్దరికి షాదీ ముబారక్‌ చెక్కులు అందజేత

కడ్తాల్‌ : కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు పేదలకు వరంగా మారాయని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. బుధవారం కడ్తాల్‌లో సర్పంచ్‌ లక్ష్మీనర్సింహారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 96 మందికి కల్యాణలక్ష్మి, ఇద్దరికి షాదీముబారక్‌ చెక్కులను జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌, ప్యాక్స్‌ చైర్మన్‌ వెంకటేశ్‌గుప్తాతో కలిసి ఎమ్మె ల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ ఈ పథకాల ద్వారా పేదింటి ఆడపడుచుల పెండ్లికి రూ.1,00116లను  అందజేస్తామన్నారు. పలు సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తూ పేదలకు అండగా నిలుస్తుందన్నారు. నిరంతర విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా పథకాల అమలుతో రైతులు ధీమాగా వ్యవసాయం చేస్తున్నారని వెల్లడించారు. మిష న్‌ భగీరథతో ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు, మిషన్‌ కాకతీయతో చెరువుల పునరుద్ధరణలాంటి ఎన్నో పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేశారని గుర్తుచేశా రు. పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలను పూర్తిచేసి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. రూ.22 కోట్లతో కడ్తాల్‌ నుంచి తలకొండపల్లి వరకు డబుల్‌ రోడ్డు, రూ.1.60 కోట్లతో కడ్తాల్‌-చల్లంపల్లి-సాలార్‌పూర్‌ వరకు రోడ్లకు త్వరలో శంకుస్థాపన చేస్తామని చెప్పారు. మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు భవనాల నిర్మాణాలను చేపడుతామన్నారు.  కార్యక్రమంలో తహసీల్దార్‌ మహేందర్‌రెడ్డి, ఎంపీడీఓ అనురాధ, సర్పంచ్‌లు కృష్ణయ్యయాదవ్‌, తులసీరాంనాయక్‌, యాదయ్య, భారతమ్మ, సేవ్యాబావోజీ, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్‌, గోపాల్‌, శ్రీనివాస్‌రెడ్డి, రాములుగౌడ్‌, మంజుల, ప్రియ, ఉపసర్పంచ్‌లు రామకృష్ణ, వినోద్‌, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు వీరయ్య, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జహంగీర్‌అలీ, నాయకులు నర్సింహగౌడ్‌, లాయక్‌అలీ ఉన్నారు.


logo