మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - May 27, 2020 , 01:18:22

గోదాముల కోసం స్థలాన్ని సర్వే చేయండి..

  గోదాముల కోసం స్థలాన్ని సర్వే చేయండి..

కుల్కచర్ల మండలంలో   కలెక్టర్‌ పౌసుమిబసు   స్థలాల  పరిశీలనకులకచర్ల : మండల పరిధిలో గిడ్డంగుల నిర్మాణానికి 20 ఎకరాల స్థలాలను గుర్తించాలని అధికారులను వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ పౌసుమిబసు ఆదేశించారు. మంగళవారం   ఘనాపూర్‌ గేటు దగ్గర కులకచర్ల రెవెన్యూ పరిధిలో ఉన్న 637 సర్వే నంబర్‌లో అసైన్డ్‌భూమిని ఆమె పరిశీలించారు. ప్రభుత్వం గిడ్డంగుల నిర్మాణానికి 10 ఎకరాల స్థలాన్ని గుర్తించాలని సూచించారు. విశాలంగా ఉండేందుకు 10 ఎకరాలతో పాటు మరో పది ఎకరాల భూమిని సేకరించేందుకు, సర్వే చేసి నివేదిక అందజేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

  ఘనాపూర్‌ గేటు సమీపంలోని ప్రభుత్వ భూమి 210 ఎకరాలు ఉందని, అందులో 40 ఎకరాలు పట్టాలు ఇచ్చారని అధికారులు కలెక్టర్‌కు వివరించారు.   మిగిలిన 170 ఎకరాల భూమిని గుర్తించాలని అధికారులకు ఆమె సూచించారు.  భూ వివరాల నివేదిక ఆర్డీవోకు సమర్పించాలని  క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. అభివృద్ధిలో భాగంగా మరింత భూమిని గిడ్డంగులకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని  మండలవాసులు కోరుతున్నారు.  జిల్లా కలెక్టర్‌ సర్వేయర్‌తో గూగుల్‌ మ్యాప్‌ తెప్పించుకొని  స్థలాలను పరిశీలించారు.   కార్యక్రమంలో ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, కులకచర్ల తహసీల్దార్‌ అశోక్‌కుమార్‌, ఆర్‌ఐ వెంకటగిరి, వీఆర్వో వెంకటేశ్‌, సర్వేయర్‌ ప్రసాద్‌  పాల్గొన్నారు. logo