శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Vikarabad - May 27, 2020 , 01:02:37

సర్కారు బాటలో‘సాగు’దాం..

సర్కారు బాటలో‘సాగు’దాం..

  • రైతులు ఆర్థికంగా అభివృద్ధి  చెందేందుకు సీఎం  కేసీఆర్‌ కృషి
  • పంట మార్పిడితోనే భూసారం పెరుగుతుంది
  • ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌,  కిషన్‌రెడ్డి, జైపాల్‌ యాదవ్‌
  • వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో  జోరుగా 
  • నియంత్రిత సాగుపై అవగాహన సదస్సులు

రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు  కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌ సూచనల ప్రకారం నియంత్రిత విధానంతోనే పంటలను సాగు చేయాలని, మక్కజొన్న కాకుండా పత్తి, జొన్న, కంది, రాగులు, వరిలాంటి పంటలను పండించాలని ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, జైపాల్‌యాదవ్‌, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో పంటల ప్రాధాన్యంపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు జోరుగా సాగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు కార్యక్రమాల్లో పాల్గొని రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. 

ఇబ్రహీంపట్నం రూరల్‌: సర్కారు చూపిన బాటలో పంటలను సాగు చేసుకుంటే రైతులు అధిక దిగుబ డి సాధించగలుగుతారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు అవగాహన సదస్సుల్లో భాగంగా మంగళవారం తులేకలాన్‌లో నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతును రాజు చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌  పథకాలను అమలు చేస్తున్నారని వెల్లడించారు. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న ప్రాధాన్యత పంటలను మాత్రమే సాగు చేసుకుంటే రైతులకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ప్రాంతాలవారీగా పంటల సాగుపై దృష్టి సారించారని తెలిపారు. అనంతరం వ్యవసాయాధికారులు, రైతులు, రైతుబంధు సమితి సభ్యులు, సర్పంచ్‌ లు, ఎంపీటీసీలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్దేశించిన పంటలనే సాగు చేసుకుంటామని ప్రతి ఒక్కరితో ప్రతిజ్ఞ చేయించారు. 

పంట మార్పిడితో లాభాలు 

ప్రభుత్వం నిర్దేశించిన పంటలతో పాటు  రైతులు పంటల మార్పిడి విధానాన్ని పాటించాలి. ఒకే పం ట వేస్తే దిగుబడి తగ్గి.. రైతులు నష్టపోతారు. నియోజకవర్గ  రైతులు పత్తి, జొన్న, కందుల, వరి సన్నరకంపై దృష్టి సారించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్‌, సత్తు వెంకటరమణారెడ్డి, ఏడీఏ సత్యనారాయణ, సర్పంచ్‌ చిలుకల యాదగిరి, ఎంపీటీసీ నాగటి నాగమణి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఏనుగు భరత్‌రెడ్డి, ఎంపీడీఓ నరేందర్‌రెడ్డి, రైతు బంధు సమితి మం డల కన్వీనర్‌ వంగేటి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. 

అన్నదాతల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

కడ్తాల్‌ : అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తున్నదని కల్వకుర్తి ఎమ్మె ల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. వ్యవసాయశాఖ కార్యాలయం ఆవరణలో, వానకాలం-2020, పంటల ప్రాధాన్యత వ్యవసాయసాగుపై సర్పంచ్‌ లక్ష్మీనర్సింహారెడ్డి అధ్యక్షతన రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రైతును రాజుగా చేయడానికి ముఖ్యమంత్రి సమగ్ర వ్యవసాయ విధానాన్ని తీసుకువచ్చారని తెలిపారు. వానకాలంలో రైతులు మక్కజొన్నను సాగు చేయవద్దన్నారు. వరి, పత్తి, జొన్న, రాగులు, కంది పంటను సాగు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కమ్లీ, జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌, వైస్‌ ఎంపీపీ ఆనంద్‌, ఎంపీటీసీలు శ్రీనివాస్‌రెడ్డి, గోపాల్‌, రైతుబంధు సమితి మండల సభ్యులు వీరయ్య, చందోజీ, కోఆప్షన్‌ సభ్యుడు జహంగీర్‌బాబా, ఉపసర్పంచ్‌ రామకృష్ణ, ఏఓ శ్రీలత, ఏఈఓలు స్వాతి, తేజస్విని, రైతులు పాల్గొన్నారు.   


logo