సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - May 26, 2020 , 00:11:55

ఇండ్లలోనే ప్రార్థనలు

ఇండ్లలోనే ప్రార్థనలు

వికారాబాద్: ‌ జిల్లాలో ముస్లిం సోదరులు రంజాన్‌ వేడుకలను సోమవారం జరుపుకున్నారు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన విధంగా ఇండ్లలోనే ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నెల పాటు ఉపవాసదీక్షలు చేపట్టి చివరి రోజైన రంజాన్‌ పర్వదినాన ఈద్‌-ఉల్‌-ఫితర్‌ వేడుకలను జరుపుకున్నారు. చెడు ఆలోచనలు, అధర్మం, అసత్యం లాంటివి నియంత్రించుకునే విధంగా ఉపవాసదీక్షలు చేసి అల్లాను కొలువడమే రంజాన్‌ మాసం ప్రాముఖ్యత అని ముస్లిం పెద్దలు తెలిపారు. పలుచోట్ల స్వచ్ఛందసంస్థలు, ఫౌండేషన్‌ సభ్యులు ముస్లింలకు నిత్యావసర సరుకులు అందించారు.  ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు.


logo