శనివారం 08 ఆగస్టు 2020
Vikarabad - May 25, 2020 , 23:10:44

పోలీసుల సేవలు మరువలేనివి

పోలీసుల సేవలు మరువలేనివి

 వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌

వికారాబాద్‌: పోలీస్‌ సిబ్బంది ప్రస్తుతం వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పని చేస్తున్నారని, వారి సేవలు మరువలేనివని వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ అన్నారు. సోమవారం సబితాఆనంద్‌ దవాఖాన ఆవరణలో సబితాఆనంద్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్‌డౌన్‌ నేపథ్యంలో పోలీసుల సేవలను, వారి పని తీరును కొనియాడారు. సమాజంలో ఉన్న మనమందరం వీరందరినీ గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు మనమంతా ఏమిచ్చినా తక్కువవేనని అన్నారు.  కరోనా నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ కోసం పగలు, రాత్రి తేడా లేకుండా పోలీసులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. ప్రత్యేకంగా వికారాబాద్‌ డీఎస్పీ సంజీవరావు, సీఐలు శ్రీనివాస్‌రావు, రాజశేఖర్‌, ప్రమీల సేవలను అభినందించారు. పోలీస్‌ సిబ్బందితో కలిసి భోజనం చేయడం సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ శీనయ్య, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, నర్సింహులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


logo