శనివారం 08 ఆగస్టు 2020
Vikarabad - May 24, 2020 , 22:53:05

కష్టకాలంలో.. కరోనా రుణాలు

కష్టకాలంలో.. కరోనా రుణాలు

  • మహిళా సంఘాలకు కొవిడ్‌ రుణాలు
  • ప్రతి సభ్యురాలికి  రూ. 5వేలు 

కులకచర్ల : కరోనా  నేపథ్యంలో సామాన్యులు ఇబ్బందులు పడకుండా   బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు కొవిడ్‌-19 రుణాలు అందజేసేందుకు సెర్ప్‌ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.  మండలంలో 1100లకు పైగా మహిళా సంఘాలున్నాయి. అందులో కొవిడ్‌-19 బ్యాంకు రుణాలకు అర్హత ఉన్న 859 మహిళా సంఘాలకు రుణాలు అందించాలని  అధికారులు   నిర్ణయించారు.   గ్రామాల్లో ఇప్పటికే   మహిళా సంఘాలకు రుణాలు అందించేందుకు సెర్ప్‌ సిబ్బంది బ్యాంకులకు డాక్యుమెంట్లు సమర్పించారు.  మండలంలో ఎస్‌బీఐతో పాటు తెలంగాణ గ్రామీణ బ్యాంకు, చౌడాపూర్‌, ముజాహిద్‌పూర్‌ తెలంగాణ గ్రామీణ బ్యాంకులు రుణాలు అందిస్తున్నాయి.

ప్రతి సభ్యురాలికి రూ. 5వేలు రుణం..

మహిళా సంఘాల్లోని ప్రతి మహిళకు రూ. 5వేల కొవిడ్‌ రుణం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సిబ్బంది బ్యాంకులకు మహిళా సంఘాలకు సంబంధించి డాక్యుమెంట్‌ అందజేస్తుండటంతో బ్యాంకర్లు కూడా రుణాలు మంజూరు చేస్తున్నారు. దీంతో మహిళా సంఘంలోని ప్రతి మహిళకు రూ.5 వేల రుణం  అందుతుంది. కాగా తీసుకున్న రుణాలు 18 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెల రూ. 300 తీసుకున్న కొవిడ్‌ రుణానికి వాయిదా చెల్లించాలి. 

అర్హత ఉన్న మహిళా సంఘాలకు  రుణాలు

గ్రామాల్లో ఉన్న అర్హత ఉన్న మహిళా సంఘాలకు కొవిడ్‌ రుణా లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దీనికి బ్యాంకర్లు కూడా సహకరించడంతో   రుణాలు మహి ళా సంఘాల సభ్యులకు అందజేస్తు న్నాం.  కొవిడ్‌ రుణాలు ప్రతి నెల రూ.300 చొప్పున 18 వాయిదాలు చెల్లించాలి. మహిళా సంఘంలోని ప్రతి మహిళకు రూ. 5వేలు అందజేస్తున్నాం.

 - వెంకట్‌నర్సింహులు, సీసీ కుస్మసముద్రం


రుణాలు అందజేయడం అభినందనీయం

కరోనా కాలంలో మహిళా సం ఘాల సభ్యులకు కొవిడ్‌ రుణాలు అందించడం అభినందనీయం. లాక్‌డౌన్‌ సమ యంలో బ్యాంకు ద్వారా రూ. 5వేల రుణం అందించ డం ద్వారా ఆర్థికంగా ఇబ్బందులు తొలుగుతాయి. ప్రతి నెల కొద్దిపాటి వాయిదా రూపంలో  రుణం తీసుకున్నవారు సులభంగా చెల్లిస్తారు. 

- అశోక్‌కుమార్‌, స్వెరోస్‌ సర్కిల్‌ జిల్లా అధ్యక్షుడు


logo