గురువారం 13 ఆగస్టు 2020
Vikarabad - May 24, 2020 , 22:41:06

వెజిటబుల్‌ జోన్‌గా జిల్లా..

వెజిటబుల్‌ జోన్‌గా జిల్లా..

  • యోచిస్తున్నప్రభుత్వం
  • మక్కజొన్నను సాగు చేయొద్దు 
  • నేటి నుంచిగ్రామాల్లో రైతు అవగాహన సదస్సులు
  • ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి 

నగర   ఉన్న రంగారెడ్డి జిల్లాను వెజిటబుల్‌ జోన్‌గా  ్లపభుత్వం యోచిస్తున్నదని ఇబ్రహీంపట్నం  మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెలిపారు.  అవసరమైన కూరగాయలను  పండించేలా ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు.  ఇప్పటికే క్రాప్‌ కాలనీలను ఏర్పాటు చేసిందని, ప్రభుత్వం సూచించిన పంటలను వేసి లాభాలు పొందాలని రైతులకు సూచించారు. మక్కజొన్న సాగు చేయవద్దని, మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు వంటి పంటలు వేయాలని పేర్కొన్నారు. రైతుబంధు సమితి  వ్యవసాయాధికారులు, రైతులతో తన  కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు.                        

ఇబ్రహీంపట్నం: పంట సాగుపై గ్రామీణ ప్రాంతాల్లో వారం రోజుల పాటు అవగాహన కల్పించనున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. నగర శివారులో విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లాను వెజిటబుల్‌ జోన్‌గా ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తున్నాదని ఆయన తెలిపారు. ఆదివారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో రైతు బంధు సమితి సభ్యులు, వ్యవసాయాధికారులు, రైతులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కూరగాయల ఉత్పత్తులు జరుగకపోవడంతో ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని పేర్కొన్నా రు. అవసరమైన కూరగాయలను జిల్లాలోనే సాగు చేయాలని, అందుకోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే జిల్లాలో క్రాప్‌ కాలనీలు ఏర్పాటు చేసి రైతులకు లాభం చేకూర్చే పనులు చేపట్టిందన్నారు. అవసరమైన కూరగాయల నార్లను ఇతర ప్రాంతా ల నుంచి తెచ్చుకోకుండా స్థానికంగానే నారు మడులను వ్యవసాయాధికారులు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. గతంలో పండించిన మక్కజొన్న నేటికి ప్రభుత్వం వద్ద నిల్వ ఉందని, దీంతో ఈ సారి సాగు చేస్తే రైతులు నష్టపోయే అవకాశం ఉందని ప్రభుత్వం నిషేధించిందన్నారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు వంటి పంటలను సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. 

జిల్లాలో వర్షాభావ పరిస్థితులు కూడా అనుకూలంగా లేకపోవడంతో ఉన్న కొద్దిపాటి నీటితో ఆరుతడి పంటలు వేసుకోవాలన్నారు. కూరగాయల తోటలు సాగుచేయడం వల్ల ప్రభుత్వం డ్రిప్‌ సౌకర్యం కూడా కల్పిస్తుందన్నారు. కొహెడ సమీపంలో ఏర్పాటు చేసిన మార్కెట్‌ను అన్ని హంగులతో త్వరలోనే రైతుల అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ మార్కెట్‌లో పండ్లు, కూరగాయలు విక్రయించుకునే అవకాశం కల్పిస్తామన్నారు. రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇచ్చే పంటల సాగుకు ప్రోత్సహిస్తున్నాదని, రైతులంతా వాటినే సాగు చేయాలని సూచించారు. రైతు బంధు సమితి సభ్యులు గ్రామాల్లో రైతులు ఏ పంటలు వేసుకోవాలనే దానిపై చైతన్యం కల్పించాలన్నారు. 

నేటి నుంచి గ్రామాల్లో అవగాహన సదస్సులు

ప్రభుత్వం సూచించిన పంటలపై రైతులకు అవగాహన కల్పించడం కోసం సోమవారం నుంచి శుక్రవారం వరకు అన్ని గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. ప్రతి గ్రామంలో ఈ సదస్సులు నిర్వహించి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడినిచ్చే పంటలు వేసుకోవాలన్నారు. శాస్త్రవేత్తలు సూచించిన విధంగా ఆయా భూముల్లో ఏయే పంటలు వేసుకోవాలనే దానిపై సాగు చేసుకోవాలని, వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు. రైతులంతా సదస్సులకు హాజరై అధికారులు సూచించిన పంటలనే వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ ఏడీఏ సత్యనారాయణ, ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ వెంకటరమణారెడ్డి, రైతుబంధు సమితి సభ్యులు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ యాదగిరి, రైతులు, నాయకులు పాల్గొన్నారు. logo