మంగళవారం 26 మే 2020
Vikarabad - May 24, 2020 , 00:23:52

హరితహారానికి మొక్కలు సిద్ధం

హరితహారానికి మొక్కలు సిద్ధం

వికారాబాద్‌ రూరల్‌ : గ్రామాల్లోని వన నర్సరీల్లో పెరుగుతున్న మొక్కలు రైతులకు కావాల్సినన్ని అందించేందుకు సిద్ధం చేయాలని ఎంపీడీవో సుభాషిణి అన్నారు. శనివారం మండల పరిధిలోని సర్పన్‌పల్లి, జైదుపల్లి గ్రామాల్లో వన నర్సరీలను పరిశీలించారు. ఏపుగా పెరిగిన మొక్కలను ఒకవైపు, చిన్న మొక్కలను మరోవైపు ఉంచాలని సిబ్బందికి సూచించారు. జూన్‌ చివరి వరకు వన నర్సరీల్లో ఉన్న మొక్కలను పంపిణీకి సిద్ధంగా ఉంచాలన్నారు. పండ్ల మొక్కలను గ్రామంలోని ప్రతి ఒక్కరికి అందించాలన్నారు. గ్రామాల్లో పూర్తి కాని డంపింగ్‌యార్డు పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏపీవో శ్రీనివాస్‌, ఈసీ నవీన్‌ ఉన్నారు. logo