శనివారం 06 జూన్ 2020
Vikarabad - May 24, 2020 , 00:20:56

రైతు బీమాతో అన్నదాతకు భరోసా

రైతు బీమాతో  అన్నదాతకు భరోసా

 పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి

దోమ: రైతు బీమాతో రైతుల కుటుంబాలకు   ప్రభుత్వం భరోసా కల్పించిందని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రానికి చెందిన కుమ్మరి బాలకిష్టయ్య  భార్యకు  రైతు బీమా కింద మంజూరైన రూ.5 లక్షల  బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ను  ఎమ్మెల్యే  అందజేశారు. బాలకిష్టయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు.  కార్యక్రమంలో జడ్పీటీసీ నాగిరెడ్డి, ఎంపీపీ అనుసూయ,  సర్పంచ్‌ రాజిరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, లక్ష్మయ్య, యాదయ్య   పాల్గొన్నారు.


logo