మంగళవారం 26 మే 2020
Vikarabad - May 24, 2020 , 00:10:44

రైతువేదిక సాగుదీపిక..

రైతువేదిక సాగుదీపిక..

  • జిల్లాల్లో  సేద్యం
  •  5వేల   సమావేశ మందిరం
  •  ఉమ్మడి జిల్లాలో 182  ఏర్పాటు
  •  ఇప్పటికే స్థలాల గుర్తింపు
  •  ఈ  నిర్మాణాల పూర్తికి అధికారుల కసరత్తు
  •  అన్నదాతలకు అందుబాటులో వ్యవసాయాధికారులు

వ్యవసాయాన్ని  మార్చేందుకు   ప్రభుత్వం..  అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో రైతు వేదికలను ఏర్పాటు చేస్తున్నది.  వ్యవసాయాధికారులు రైతులకు అందుబాటులో ఉండి పభుత్వ పథకాలు, సాగు విధానంపై శిక్షణ, అవగాహన కల్పించనున్నారు.   ఒక క్లస్టర్‌గా.. క్లస్టర్‌కో వేదిక చొప్పున ఉమ్మడి జిల్లాలో  సమావేశ మందిరాలను నిర్మించాలని నిర్ణయించారు. ఇప్పటికే చాలాచోట్ల స్థలాలను గుర్తించిన అధికారులు.. ప్రభుత్వానికి పతిపాదనలు పంపారు.  వేదికను డై.12.5లక్షలతో   నెలల్లో పూర్తి చేసేందుకు  చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 83 రైతు వేదికల నిర్మాణానికి రూ.10.37 కోట్లు, వికారాబాద్‌లో  మందిరాలకు రూ.11.88కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. 

 రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/  నమస్తే తెలంగాణ

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ: ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధించి పలు సంస్కరణలు చేపట్టింది. అన్నదాతలకు పలు సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలుచేస్తున్నది. వందల సంఖ్యలో మండల వ్యవసాయ విస్తరణాధికారులను (ఏఈవో) కూడా నియమించి, రైతులకు వారి సేవలు అందించేలా చేసింది. ఇంకా జిల్లాలో కొన్ని చోట్ల ఏఈవో పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇటీవల నోటిఫికేషన్‌ సైతం విడుదల చేశారు. దీంతో పక్కాగా రైతు వేదికలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. వ్యవసాయ శాఖాధికారులు ఆయా మండలాల్లో రైతు వేదిక నిర్మాణాల గురించి క్లస్టర్ల వారీగా ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధం చేశారు. జిల్లాలో 2.81 లక్షల మంది రైతులకుగాను 7లక్షల ఎకరాల భూమి జిల్లాలో ఉంది. 5వేల ఎకరాలకు 2,500 మంది రైతులు సద్వినియోగం చేసుకోనున్నారు. 

జిల్లాలో రూ.10.37 కోట్లతో 83 క్లస్టర్లు..

జిల్లాలో 83 క్లస్టర్లలో రైతు వేదికలను నిర్మించాలని వ్యవసాయ శాఖ తలపెట్టింది. అయితే వేదిక నిర్మాణానికి అర ఎకరం ప్రభుత్వ భూమిని కేటాయించారు. జిల్లాలో ఈ వేదికల నిర్మాణానికి సంబంధించి అన్ని చోట్ల నిర్మాణ ప్రక్రియ పూర్తి స్థాయి లో అడుగులు పడనున్నాయి. ఒక్కో భవనానికి రూ.12.50 లక్షల చొప్పున జిల్లాలోని 83 భవనాలకు రూ.10.37 కోట్లతో త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.

24 మండలాల్లోనే నిర్మాణాలు..

జిల్లాలో 27 మండలాలుండగా.. పంటల సాగు ఉన్న మండలాల్లోనే రైతు వేదికల నిర్మాణం జరుగనుంది. మండలాల్లో ఈ క్లస్టర్లను బట్టి వేదికల నిర్మాణం చేస్తున్నారు. 24 మండలాల్లో వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 5వేల ఎకరాలకు 2,500 మంది రైతుల చొప్పున మొత్తం 2లక్షల7వేల500 మంది రైతులకు ఇది ఉపయోగపడనుంది. అబ్దుల్లాపూర్‌మెట్‌లో 1, ఇబ్రహీంపట్నం 2, మంచాల 3, యాచారం 4, బాలాపూర్‌ 1, కందుకూరు 6, మహేశ్వరం 3, చేవెళ్ల 5, మొయినాబాద్‌ 2, షాబాద్‌ 6, శంకర్‌పల్లి 4, గండిపేట 1, శంషాబాద్‌ 2, రాజేంద్రనగర్‌ 1, చౌదరిగూడ 3, ఫరూఖ్‌నగర్‌ 5, కేశంపేట 6, కొందుర్గు 4, కొత్తూరు 2, నందిగామ 2, తలకొండపల్లి 6, కడ్తాల్‌ 4, మాడ్గుల 6, ఆమనగల్లులో 4 చొప్పున ఈ వేదికలు నిర్మించనున్నారు.

వికారాబాద్‌ జిల్లాలో..

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: జిల్లాలో 99 రైతు వేదికలు నిర్మించనున్నారు. వీటిని యాసంగిలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో దానికి అనుగుణంగా జిల్లా వ్యవసాయాధికారులు చర్యలు చేపట్టారు. వచ్చేనెలలో నిర్మాణాలు ప్రారంభించి, 4 నెలల్లోగా పూర్తిచేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రతీ 5 వేల ఎకరాలకు ఒకటి చొప్పున జిల్లాలో 99 ఏర్పాటుచేయనున్నారు. ఇప్పటివరకు 97 స్థలాలను గుర్తించారు. ఒక్కో రైతు వేదికకు రూ.12 లక్షలు ఖర్చు చేస్తున్నది. జిల్లాలో 99 వేదికలకు రూ.11.88 కోట్ల నిధులు కేటాయించనున్నది. 

వేదికలకు 97 స్థలాల గుర్తింపు

జిల్లాలో 99 రైతు వేదికలను ఏర్పాటు చేయనుండగా, ధారూర్‌లో 7, దోమ 5, నవాబుపేట్‌ 5, వికారాబాద్‌ 4, మర్పల్లి 5, పూడూర్‌ 5, కుల్కచర్ల 4, కోట్‌పల్లి 3, మోమిన్‌పేట్‌ 5, పరిగి 6, బంట్వారం 2, తాండూర్‌ 6, పెద్దేముల్‌ 6, బషీరాబాద్‌ 7, యాలాల 5, కొడంగల్‌ 8, దౌల్తాబాద్‌ 8, బొంరాసుపేట్‌ 3 రైతు వేదికలను నిర్మించనున్నారు. పూడూర్‌ మండలంలోని చన్గోముల్‌, దౌల్తాబాద్‌ మండలం బాలంపేట్‌లో గ్రామకంఠం కానీ, ప్రభుత్వ భూములు లేకపోవడంతో పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ ఏఈవో కార్యాలయం కూడా ఏర్పాటు చేయనున్నారు. కంప్యూటర్‌, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించేందుకు టీవీలను ఏర్పాటు చేయనున్నారు.  

ప్రయోజనాలు ఇవే..

రైతు వేదికల వల్ల వ్యవసాయ మండల పాలన ఇంకా వికేంద్రీకరించినట్లవుతుంది. రైతులకు వ్యవసాయ శాఖ మరింత చేరువవుతుంది. రైతు వేదికలో ఏఈఓలకు ప్రత్యేక గదిని కేటాయిస్తారు. ఒక్కో వేదిక పరిధిలో మూడు నుంచి నాలుగు గ్రామాలు ఉండడంతో రైతులు తమకు సమీపంలోని రైతు వేదికల వద్దకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. పంటలకు సంబంధించిన వివరాలు, శిక్షణ కార్యక్రమాలు, వ్యవసాయ పథకాలు, కార్యక్రమాలు, సూచనలు, సలహాలను మండల కేంద్రానికి వెళ్లకుండా తమకు చేరువలో ఉన్న రైతు వేదిక వద్దకు వెళ్లి తెలుసుకోవచ్చు. అలాగే ఇన్నాళ్లు ఏఈలు గ్రామాల్లో పర్యటించినా వారు ఉండేందుకు ఎక్కడా ప్రత్యేక ఏర్పాటుగానీ.. రైతులతో మాట్లాడేందుకు వేదికగానీ లేదు. ఆరు బయటనే సమావేశాలను నిర్వహించాల్సి వచ్చేది. రైతులను కలిసేందుకు వారి వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లాల్సి వచ్చేది లేదా చెట్ల కింద గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్దకు పోవాల్సి వచ్చేది. రైతు వేదికలో సమావేశ మందిరం, ఏఈఓ గది, మరుగుదొడ్లు, మైక్‌ సౌకర్యం, వంటగది నిర్మాణం చేయనున్నారు. ఆయా క్లస్టర్ల పరిధిలో మట్టి నమూనాలు సేకరించి ప్రయోగాలు చేసేందుకు రైతు వేదికల్లో ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. 

వేదిక రైతులకు ఒక ఫ్లాట్‌ ఫాం...


ఈ వేదిక ఏర్పాటుతో గ్రామ పరిధిలో రైతులకు ఒక ఫ్లాట్‌ ఫాం ఏర్పడింది. మండలానికి వచ్చిన విత్తనాలు, విత్తనాలు క్లస్టర్‌లోని గోదాంలో నిల్వ చేస్తారు.  కావాల్సినప్పుడు తీసుకునేందుకు వెలుసుబాటు ఏర్పడింది. ఎరువులు, విత్తనాల కోసం ప్రతిసారి మండల కేంద్రాల్లోని వ్యవసాయ కార్యాలయాలను ఆశ్రయించే బాధ తప్పింది. దీంతో సమయం కూడా కలిసి వస్తుంది. క్లస్టర్‌ పరిధిలోని రైతులు సమావేశాలు ఏర్పాటు చేసుకుని, తమ అభిప్రాయాలను ఇతరులతో పంచుకోవచ్చు. వ్యవసాయ సమస్యలను చర్చించుకోవచ్చు. 

                             - రామకృష్ణయ్య, రైతు, పెద్దనందిగామlogo