సోమవారం 03 ఆగస్టు 2020
Vikarabad - May 23, 2020 , 23:57:26

వైద్యులు, వైద్య సిబ్బంది దేవుళ్లు

వైద్యులు, వైద్య సిబ్బంది దేవుళ్లు

వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌

వికారాబాద్‌ : వైద్యులు, వైద్య సిబ్బంది దేవుళ్లని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ అన్నారు. శనివారం సబితా ఆనంద్‌ దవాఖాన ఆధ్వర్యంలో డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లను ఘనంగా సన్మానించి అనంతరం వారితో కలిసి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో ఇప్పుడు దేవాలయాలు, మసీదులు, చర్చిలు బంద్‌ అయ్యాయని, దేవుళ్లు ఎవరయ్యారంటే ప్రాణాలను తెగించి మన కోసం కరోనాతో యుద్ధం చేస్తున్న ప్రత్యక్ష దైవాలు డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఆశవర్కర్లు, ఏఎన్‌ఎంలు, పారిశుద్ధ్య కార్మికులన్నారు. వీరంతా వారి ఆరోగ్యాలను లెక్క చేయకుండా పని చేస్తున్నారన్నారు. వీరు సేవలు వెలకట్టలేనివన్నారు. పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిందన్నారు. పేదలను ఆదుకునేందుకు పలు సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ మల్లికార్జున్‌, దవాఖాన సూపరింటెండెంట్‌ శాంతప్ప, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ పాండు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


logo