మంగళవారం 26 మే 2020
Vikarabad - May 22, 2020 , 23:09:05

రైతు వేదికలకు స్థలాల సేకరణ

  రైతు వేదికలకు స్థలాల సేకరణ

 కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌

 వానకాలం సాగు, నియంత్రిత వ్యవసాయం, రైతు వేదికల నిర్మాణం,  సెజ్‌ల ఏర్పాటుపై  వ్యవసాయ అధికారులు, 

తహసీల్దార్లు,  రైతు బంధు ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ: జిల్లాలో రైతు వేదికల నిర్మాణాల కు క్లస్టర్ల వారీగా భూమిని గుర్తించి వ్యవసాయ శాఖ అధికారు లకు అందించామని కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌ తెలిపారు. ఈ గుర్తించిన భూముల్లో వెంటనే రైతు వేదికల నిర్మాణాలను చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో వానకాలం పంటల సాగు, నియంత్రిత వ్యవసాయం, రైతు వేదికల నిర్మా ణం, వ్యవసాయ సెజ్‌ల ఏర్పాటు తదితర అంశాలపై శుక్రవారం వ్యవసాయ అధికారులు, తహసీల్దార్లు, రైతు బంధు ప్రతినిధు లతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అదనపు కలెక్ట ర్‌ హరీశ్‌, రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్‌ వంగేటి లక్ష్మా రెడ్డి, డీఏవో గీతారెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్తలు ‘క్రీడ’కు చెందిన విద్యాశేఖర్‌, సుధారాణి ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. రైతులు వ్యవసాయ సంబంధిత విషయాలు, మార్కెటింగ్‌ వ్యవస్థ, ఆధునిక పద్ధతు లు, యాంత్రీకరణ తదితర విషయాలను చర్చించేందుకు ఈ వే దికలు ఉపయోగపడుతాయన్నారు.  జిల్లాలో ఉన్న 83 క్లస్టర్లలో వీటిని నిర్మించాలని ప్రభుత్వం ఆదేశించిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నియంత్రిత సాగు, వాన కాలంలో ఏయే పంటలు సాగు చేయాలి, సేంద్రియ ఎరువుల వినియోగం తదితర అంశాలపై క్లస్టర్లు, గ్రామాల వారీగా రైతు చైతన్య సదస్సులను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ వివరించారు. క్లస్టర్ల వారీగా ఏర్పాటు చేసే రైతు చైతన్య సదస్సులకు ప్రజా ప్రతినిధులందరితో పాటు సహకార సంఘాలు, రైతు బంధు ప్రతినిధులను ఆహ్వానించాలన్నారు. జిల్లాలో 18,162 మందికి రైతు బంధు నగదును సంబంధిత మండల వ్యవసాయాధికా రుల ద్వారా బ్యాంకుల్లో వేశామన్నారు. అయితే అకౌంట్లు సరిగా లేకపోవడం, ఆధార్‌ నంబర్లు లేకపోవడం తదితర స్వల్ప సమస్యల వల్ల కొందరికి నగదు జమ కాలేకపోవచ్చన్నారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏవోలను ఆదేశించారు. జిల్లాలో వ్యవసాయ ఆర్థిక మండళ్ల ఏర్పాటు, నియోజక వర్గా లవారీగా గోదాముల నిర్మాణాలకు భూములు సేకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రైతుబంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్‌ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మక్కజొన్న నిల్వ లు అధికంగా ఉన్నాయన్నారు. పొరుగు రాష్ర్టాలైన ఛత్తీస్‌గఢ్‌,  ఒడిశా, మహారాష్ట్రల నుంచి తక్కువ ధరకే మక్కలు లభిస్తున్నం దున ఈసారి జిల్లాలో మక్క పంట వేయవద్దని, యాసంగిలో వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజన్‌ అనుసరించి రైతులను మంచి ఆదాయం లభించే పంటలు వేసేలా క్లస్టర్ల వారీగా నిర్వహించే రైతు చైతన్య సదస్సుల్లో తనతో పాటి రైతు బంధు సభ్యులందరూ పాల్గొంటారని ఆయన ప్రకటించారు. జిల్లాలో వరి, పత్తి, కందులు, కూరగాయల సాగు తదితర సూచించిన పంటల విత్తనాలు, సేంద్రియ వ్యవసాయం సంబంధిత అంశాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు విద్య శేఖర్‌, సుధారాణి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు.


logo