శనివారం 06 జూన్ 2020
Vikarabad - May 21, 2020 , 23:55:11

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

వికారాబాద్‌ అదనపు కలెక్టర్‌ చంద్రయ్య

నవాబుపేట : ప్రస్తుత పరిస్థితులను గమనించి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య సూచించారు. గురువారం మండల పరిధిలోని మైతాబ్‌ఖాన్‌గూడ, మాదిరెడ్డిపల్లి, దాతాపూర్‌ తదితర గ్రామాలను సందర్శించి నర్సరీలను, మొక్కలను, శ్మశానవాటిక నిర్మాణాలను, పారిశుద్ధ్యం తీరును పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామ కార్యదర్శుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ వానకాలంలో అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి సర్పంచ్‌లు, గ్రామ కార్యదర్శులు కృషి చేయాలన్నారు. లాక్‌డౌన్‌లో ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలన్నారు. మంచి నీటి సరఫరా వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఎలాంటి మరమ్మతులు లేకుండా చూడాలన్నారు. కరోనా నేపథ్యంలో కూలీలకు పనులు కల్పించడంలో జిల్లా రాష్ట్రంలో 4వ స్థానంలో ఉందని ఆయన చెప్పారు. కార్యమ్రంలో ఎంపీడీవో సుమిత్రమ్మ, ఏపీవో లక్ష్మి, ఎంపీటీసీ విజయ్‌కుమార్‌, సర్పంచ్‌లు పాల్గొన్నారు.


logo