శనివారం 06 జూన్ 2020
Vikarabad - May 21, 2020 , 01:54:13

ఖాతాలకు ఆధార్‌ లింక్‌ చేయాలి

ఖాతాలకు ఆధార్‌ లింక్‌ చేయాలి

వికారాబాద్‌ కలెక్టర్‌ పౌసుమి బసు

వికారాబాద్‌ : ప్రభుత్వం సూచించిన పంటలను సాగు చేసే రైతులకు మాత్రమే రైతుబంధు వర్తిస్తుందని కలెక్టర్‌ పౌసుమి బసు అన్నారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలో వివిధ బ్యాంకుల అధికారులు, వ్యవసాయ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు వేదికల ఏర్పాటు కోసం భూమిని సేకరించాలని వ్యవసాయాధికారులకు సూచించారు. వానకాలం ప్లాన్‌ గురించి వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతుల ఖాతాలకు ఆధార్‌ లింక్‌ చేసే విధంగా చర్యలు చేపట్టాలని బ్యాంకు అధికారులకు సూచించారు. రైతుల ఖాతాలో రైతుబంధు చెక్కులు జమ చేయడానికి రైతు పేరు, తండ్రి పేరు, ఖాతా నంబర్‌, సర్వే నంబర్‌, గ్రామం, మండలం తదితర వివరాలతో ఓ నమూనాను తయారు చేయాలన్నారు. ఇప్పటివరకు ఎంతమంది రైతులకు లోన్లు మంజూ రు చేశారు? ఎంతమందికి తిరస్కరించారు? రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయా? అనే వివరాలను బ్యాంకు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్లు మోతీలాల్‌, చంద్రయ్య, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.


logo