గురువారం 25 ఫిబ్రవరి 2021
Vikarabad - May 19, 2020 , 01:47:04

నేడు రోడ్డెక్కనున్న బస్సులు

 నేడు రోడ్డెక్కనున్న బస్సులు

అన్ని రూట్లలో నడిపేందుకు  జిల్లా అధికారుల చర్యలు 

భౌతిక దూరం పాటిస్తూ ప్రయాణం చేసేలా ఏర్పాట్లు 

 యాదగిరిగుట్ట డిపోలో  బస్సులకు శానిటైజేషన్‌

అంతా సిద్ధం చేశామంటున్న యాదగిరిగుట్ట డీఎం రఘు

 యాదాద్రి భువనగిరి, నమస్తే తెలంగాణ:  జిల్లాలోనే ఏకైక ఆర్టీసీడిపో యాదగిరిగుట్ట నుంచి మంగళవారం బస్సులు రోడ్డెక్కడానికి ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్చి 22 నుంచి బస్సుల రాకపోకలను  నిషేధించిన నేపథ్యంలో ఆర్డీసీకి భారీ ఎత్తున నష్టాలు వచ్చాయి. గుట్టడిపోలో 110 బస్సులు ఉన్నాయి. డిపో మేనేజర్‌ రఘు సోమవారం మెకానిక్‌లు, హెల్పర్లను పిలిపించి అవసరమైన బస్సులకు మరమ్మతులు చేయించారు. బ్యాటరీలను చెక్‌చేసి చార్జింగ్‌ పెట్టించారు. అదేవిధంగా ప్రతి బస్సు టైర్లను చెక్‌ చేసి గాలి కొట్టించారు. కరోనా వల్ల సీట్లకు నెంబరింగ్‌ ఇచ్చి భౌతికదూరం పాటించేందుకు సీటింగ్‌ ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ నోటీస్‌ బోర్డుపై సూచనల పత్రాన్ని అతికించారు.

 గుట్టడిపోలో 200 మంది డ్రైవర్లు, 160 మంది కండక్టర్లు, 100 మంది మెకానిక్‌లతోపాటు 70 మంది ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులు ఉన్నారు. డిపో ఆవరణలో శానిటైజేషన్‌తోపాటు సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. మరుగుదొడ్లు, మూత్రశాలలను ఎప్పటికప్పుడు క్లీన్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జేబీఎస్‌, సీబీఎస్‌ వరకు బస్సులు నడిచే అవకాశం లేదని, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్డు వరకు  మాత్రమే హైదరాబాద్‌ రూట్లో బస్సులు నడుస్తాయని డీఎం తెలిపారు. మోత్కూరు, నల్లగొండ, తిరుమలగిరి, రాజాపేట తదితర అన్ని రూట్లల్లో బస్సులు నడుస్తాయన్నారు. ప్రయాణికులు భౌతికదూరం పాటించి కండక్టర్లకు సహకరించాలని ఆయన కోరారు.

యాదాద్రి భువనగిరి, నమస్తే తెలంగాణ:  జిల్లాలోనే ఏకైక ఆర్టీసీడిపో యాదగిరిగుట్ట నుంచి మంగళవారం బస్సులు రోడ్డెక్కడానికి ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్చి 22 నుంచి బస్సుల రాకపోకలను  నిషేధించిన నేపథ్యంలో ఆర్డీసీకి భారీ ఎత్తున నష్టాలు వచ్చాయి. గుట్టడిపోలో 110 బస్సులు ఉన్నాయి. డిపో మేనేజర్‌ రఘు సోమవారం మెకానిక్‌లు, హెల్పర్లను పిలిపించి అవసరమైన బస్సులకు మరమ్మతులు చేయించారు.బ్యాటరీలను చెక్‌చేసి చార్జింగ్‌ పెట్టించారు. అదేవిధంగా ప్రతి బస్సు టైర్లను చెక్‌ చేసి గాలి కొట్టించారు. కరోనా వల్ల సీట్లకు నెంబరింగ్‌ ఇచ్చి భౌతికదూరం పాటించేందుకు సీటింగ్‌ ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ నోటీస్‌ బోర్డుపై సూచనల పత్రాన్ని అతికించారు. గుట్టడిపోలో 200 మంది డ్రైవర్లు, 160 మంది కండక్టర్లు, 100 మంది మెకానిక్‌లతోపాటు 70 మంది ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులు ఉన్నారు.

డిపో ఆవరణలో శానిటైజేషన్‌తోపాటు సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. మరుగుదొడ్లు, మూత్రశాలలను ఎప్పటికప్పుడు క్లీన్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జేబీఎస్‌, సీబీఎస్‌ వరకు బస్సులు నడిచే అవకాశం లేదని, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్డు వరకు  మాత్రమే హైదరాబాద్‌ రూట్లో బస్సులు నడుస్తాయని డీఎం తెలిపారు. మోత్కూరు, నల్లగొండ, తిరుమలగిరి, రాజాపేట తదితర అన్ని రూట్లల్లో బస్సులు నడుస్తాయన్నారు. ప్రయాణికులు భౌతికదూరం పాటించి కండక్టర్లకు సహకరించాలని ఆయన కోరారు.

VIDEOS

logo