సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - May 19, 2020 , 01:32:06

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం

 సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం

 జోరుగా పారిశుద్ధ్య పనులు 

స్వచ్ఛ తెలంగాణలో భాగస్వాములవుతున్న గ్రామీణం

పరిసరాలను శుభ్రం చేస్తున్న పంచాయతీ సిబ్బంది

పాల్గొంటున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు

వికారాబాద్‌: ప్రత్యేక పారిశుద్ధ్య ప్రణాళికపై  వికారాబాద్‌ జిల్లాలో సోమవారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల నాయకులు, అధికారులు .. పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించి, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.  గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా పంచాయతీ కార్యదర్శులు బాధ్యత తీసుకోవాలని, సీజనల్‌ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షం నీరు నిలువకుండా గుంతలు పూడ్చాలని, పాడుబడిన ఇండ్లు, ముళ్లపొదలు, పిచ్చి మొక్కలు తొలిగించాలన్నారు.


logo