బుధవారం 05 ఆగస్టు 2020
Vikarabad - May 16, 2020 , 00:26:47

పేదలకు సర్కారు బాసట

పేదలకు సర్కారు బాసట

  • కరోనా కట్టడికి అందరూ సహకరించాలి
  • ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి

పరిగి : పేదలకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు.  మండలంలోని చెంచులకు ఐటీడీఏ ద్వారా అందజేసిన నిత్యావసర సరుకులను శుక్రవారం పంపిణీ చేశారు. అలాగే, నీర్‌సాబ్‌తండా, గండీడ్‌ మండలం గోవిందుపల్లితండాల్లో హోం క్వారంటైన్‌లో ఉన్నవారికి నిత్యావసర సరుకులు, కూరగాయలు  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లాక్‌డౌన్‌లో పేదలు ఇబ్బంది పడకుండా సర్కారు ఆదుకుంటుందన్నారు.  శ్రేణులు సైతం తమవంతుగా పేదలను ఆదుకుంటున్నట్లు చెప్పారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చినవారు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ బి.మనోహర్‌రెడ్డి, గండీడ్‌ జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 

నిత్యావసర సరుకులు పంపిణీ

కులకచర్ల : మహారాష్ట్రలోని పుణె, ముంబయి నుంచి వచ్చిన వలస కార్మికులను ఆదుకునేందుకు 6రకాల నిత్యావసర సరుకులు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ బు య్యని మనోహర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని మక్తవెంకటాపూర్‌, కులకచర్ల, బిందెంగడ్డతండాతోపాటు వివిధ గ్రామాల్లో వలస కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. 28రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాందాస్‌నాయక్‌, మక్తవెంకటాపూర్‌ ఎంపీటీసీ శంకరమ్మ, టీఆర్‌ఎస్‌ నాయకులు సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. కామునిపల్లి తండాలో సర్పంచ్‌ మహిపాల్‌రెడ్డి అధ్యక్షతన మండల రైతుబంధు సమితి కోఆర్డినేటర్‌ పీరంపల్లి రాజు వలస కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 

దాతలు ముందుకు రావాలి

పెద్దేముల్‌ : నిరుపేదలను ఆదుకునేందుకు దాతలు ముందు కు రావాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్‌చారి కోరారు. 

మండలంలోని ఖానాపూర్‌లో తాండూరు వెల్ఫేర్‌ఫోరం  సర్పంచ్‌ నర్సింహులుతో కలిసి నిరుపేదలకు నిత్యావసర సరుకులు, కిట్‌లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ మల్లేశ్‌, పంచాయతీ కార్యదర్శి యశ్వంత్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

నిరుపేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు..

మర్పల్లి : మండలంలోని పిల్లిగుండ్ల, గుండ్ల మర్పల్లి గ్రామాల్లోని వంద మంది నిరుపేదలకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కొండల్‌రెడ్డి ఆధ్వర్యంలో మర్పల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌ ప్రవీణ్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు మల్లేశం  రం బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.  10 కిలోల బియ్యం, కిలో పప్పు, కిలో మంచినూనె, కిలో చక్కెర, కిలో ఉప్పు, కారం పొడి, పసుపు, చింతపండు అందజేశారు.   గ్రామాల సర్పంచ్‌లు పాండు, శివకుమార్‌, మల్లారెడ్డి, హరిప్రసాద్‌, రాంరెడ్డి పాల్గొన్నారు.

వికారాబాద్‌ టౌన్‌ : పట్టణంలోని శివారెడ్డిపేట కాలనీలో పనిచేసే ఆరోగ్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, రెవెన్యూ ఉద్యోగులకు టీఆర్‌ఎస్‌ నాయకులు, కాలనీవాసులు సన్మానం చేశా రు.  నిత్యావసర సరుకులు అందించారు.   లో నాయకులు దత్తు,  అడివయ్య, మధుకర్‌, వేణు, అన్వర్‌, ఖాదర్‌, షరీఫ్‌, నయీం, శంకర్‌, సతీశ్‌ 

వలస కూలీలకు కూరగాయలు పంపిణీ


బొంరాస్‌పేట : మండలంలోని కట్టుకాల్వతండా, రాంనాయక్‌తండా, గంగంబాయితండాలకు  నుంచి వచ్చిన వలస కూలీలకు  సర్పంచ్‌ మహేందర్‌  పంపిణీ చేశారు. 14రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని, జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు.


logo