సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - May 16, 2020 , 00:20:05

పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయం

పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయం

  •  ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌

వికారాబాద్‌ : కరోనా కట్టడిలో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ అన్నారు.  మున్సిపల్‌ కార్యాలయంలో పారిశుధ్య సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులతో కలిసి శుక్రవారం ప్రారంభించారు.  సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు చేశారు.  ఆయన మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు పారిశుధ్య కార్మికులకు వైద్య శిబిరం నిర్వహించామన్నారు. కరోనా వైరస్‌ దృష్ట్యా  సరైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వ్యక్తిగత ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, మాస్కులు ధరించాలన్నారు.   వైస్‌ చైర్‌పర్సన్‌ శంషాద్‌బేగం, మున్సిపల్‌ కమిషనర్‌ భోగేశ్వర్లు, కౌన్సిలర్లు, డాక్టర్లు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.


logo