మంగళవారం 04 ఆగస్టు 2020
Vikarabad - May 15, 2020 , 00:41:50

ఎస్‌హెచ్‌జీలకు కొవిడ్‌ రుణాలు

ఎస్‌హెచ్‌జీలకు కొవిడ్‌ రుణాలు

  • లాక్‌డౌన్‌లో మహిళా సంఘాలను ఆదుకునేందుకు చర్యలు
  • గత  సంబంధం లేకుండా మంజూరు
  • ఇప్పటివరకు 481  సంఘాలకు  2.14 కోట్లు అందజేత
  • జిల్లాలో మొత్తం సంఘాలు  అర్హత కలిగినవి 1043
  • గత బకాయిలపై దృష్టి సారించిన అధికారులు

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : లాక్‌డౌన్‌ సమయంలో  సహాయక సంఘాలకు  చేయూతను అందించేందుకు పభుత్వం చర్యలు చేపట్టింది.   వాటి పనితీరును బట్టి రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు కొవిడ్‌ రుణాలను మంజూరు చేస్తున్నది.  1043 సంఘాలకు అర్హత ఉన్నట్లు గుర్తించిన జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఇప్పటివరకు 481 గ్రూపులకు రూ.2.14 కోట్ల రుణాలను మంజూరు చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసిన రుణాలతో సం బంధం లేకుండా ఈ రుణాలను ఇస్తున్నారు. 

టీఆర్‌ఎస్‌  వచ్చిన నాటి నుంచి స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలను పెద్ద ఎత్తున   2014-15  సంవత్సరంలో    కోట్లు  చేసింది. 2015-16లో  మందికి రూ. 13.79కోట్లు, 2016-17లో 11,642 మందికి రూ. 12.82 కోట్లు, 2017-18లో 12,153  సభ్యులకు రూ. 12.49కోట్లు  2018-19ఆర్థిక సంవత్సరంలో 12,048 మహిళా సభ్యులకు  15.77కోట్లు, 2019-20లో 11,213మందికి రూ. 20కోట్ల రూపాయలు వడ్డీలేని రుణాలను మంజూరు చేసింది.

బకాయిల రికవరీపై ప్రత్యేక దృష్టి

మొండికేసిన సంఘాల నుంచి రుణాల  సంఘాల బలోపేతానికి  గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది.   కదలిక, మొండికేసిన సంఘాల్లో మార్పు తీసుకొచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా  సంఘాలు మొండికేసినవిగా  గుర్తించారు. వాటి నుంచి రూ. 5.53కోట్ల రుణాలను రికవరీ చేయాల్సి ఉంది. పూడూరు, బషీరాబాద్‌, ధారూరు, బొంరాస్‌పేట  మొండికేసిన సంఘాలు అధికంగా ఉన్నాయి. పూడూరు మండలంలో 85 సంఘాల నుంచి రూ.16.61లక్షలు, బషీరాబాద్‌లో 92 సంఘాల నుంచి రూ.15.99 లక్షలు, ధారూరులో 59 సంఘాల నుంచి రూ.13.88 లక్షలు, బొంరాస్‌పేటలో 70 సంఘాల నుంచి రూ.12.61 లక్షలు, తాండూరు మండలంలో 83 సంఘాల నుంచి రూ.8.37 లక్షలు, పరిగిలో 41 సంఘాల నుంచి రూ.6.43 లక్షలు, పెద్దేముల్‌లో 36 సంఘాల నుంచి రూ.6.29 లక్షలు, దోమ మండలంలో 79సంఘాల నుంచి రూ.5.11 లక్షలు, యాలా ల మండలంలో 33 సంఘాల నుంచి రూ. 3.80లక్షలు, వికారాబాద్‌లో 14సంఘాల నుంచి రూ.2.99 లక్షలు, కులకచర్లలో 52 సంఘాల నుంచి రూ.2.90 లక్షలు, మర్పల్లిలో 14 సంఘాల నుంచి రూ.1.49 లక్షలు, కొడంగల్‌ మండలంలో 6 సంఘాల నుంచి రూ.1.39 లక్షల రుణాలను రికవరీ చేయాల్సి ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. 

ఆర్థికంగా ఆదుకునేందుకే కొవిడ్‌ రుణాలు

లాక్‌డౌన్‌తో  లావాదేవీలన్నీ స్తంభించిపోయిన దృష్ట్యా మహిళా  కొవిడ్‌ రు ణాలను మంజూరు చేస్తున్నాం. పనితీరును బట్టి ఒక్కో సంఘానికి రూ. 50వేల నుంచి రూ. లక్ష వరకు ఇస్తున్నాం. ఎస్‌హెచ్‌జీ సభ్యులను ఆర్థికం గా ఆదుకునేందుకు   ఇస్తున్నాం. అలాగే,  సంఘాల పెండింగ్‌  త్వరలోనే రికవరీ చేస్తాం.

- డీఆర్‌డీవో కృష్ణన్‌


logo