మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - May 14, 2020 , 01:10:36

వలస కూలీలు హోం క్వారంటైన్‌లో ఉండాలి

వలస కూలీలు హోం క్వారంటైన్‌లో ఉండాలి

బొంరాస్‌పేట : లాక్‌డౌన్‌తో స్వస్థలాలకు తిరిగొచ్చిన వలస కూలీలు 28 రోజులు గృహ నిర్బంధంలో ఉండాలని కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని మూడుమామిళ్లతండా, బొట్లవానితండా, దేవులానాయక్‌తండాల్లో వలస కూలీలకు బుధవారం బియ్యం, కందిపప్పు పంపిణీ చేశారు. మండలానికి వెయ్యి మందికిపైగా వలస కూలీలు వచ్చారని, అందరూ  ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు. మూడిమామిళ్లతండాలో తాగునీటి సమస్య పరిష్కరిస్తామని హామీఇచ్చారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ నారాయణరెడ్డి, సర్పంచ్‌లు బద్యానాయక్‌, రాజేశ్వరి, మేఘ్యానాయక్‌, ఎంపీటీసీ తిరుపతయ్య, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కోట్ల యాదగిరి, నాయకులు పాల్గొన్నారు.

మాస్కులు ధరించని వారికి జరిమానా

స్వగ్రామాలకు వచ్చిన కూలీలు అప్రమత్తంగా ఉం డాలని మండల వైద్యాధికా రి రవీంద్రయాదవ్‌ సూచించారు.  టేకులగడ్డతండా, దరికిందితండాల్లో ఆయన  హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.  వ్యాప్తిని అరికట్టడానికి ప్రతిఒక్క రూ మాస్కు ధరించాలని ఎంపీడీవో హరినందనరావు అన్నారు. బొంరాస్‌పేట, తుంకిమెట్లలో మా స్కు  లేకుండా బయట తిరుగుతున్న వారిని గుర్తించి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు.

వలస కార్మికులకు వైద్యపరీక్షలు

కులకచర్ల : మహారాష్ట్రలోని పుణె, ముంబయి నుంచి వచ్చిన వలస కూలీలకు వైద్య  నిర్వహిస్తున్నట్లు సీహెచ్‌వో చంద్రప్రకాశ్‌ తెలిపారు. మహారాష్ట్ర నుంచి కులకచర్ల మండలానికి పెద్ద సంఖ్యలో  వలస కూలీలకు వైద్య పరీక్షలు నిర్వహించి వారిని గ్రామంలో క్వారంటైన్‌కు పంపిస్తున్నట్లు చెప్పారు.  మండలంలోని పాచ్చావ్‌కుంటతండాలో 34 మందికి, గుబ్బడి తండాలో 16మందికి వైద్యపరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.

దౌల్తాబాద్‌ : ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు క్వారంటైన్‌లో ఉండాలని తాండూరు ఆర్డీవో వేణుమాధవ్‌ రావు సూచించారు.  భాగ్యతండాలను బుధవారం ఆయన సందర్శించారు.గ్రామాల్లో వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు, ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్‌ వెంకటేశ్‌, సిబ్బంది   ఉన్నారు.

కొడంగల్‌ : వలస వెళ్లి స్వస్థలాలకు వచ్చినవారు హోం క్వారంటైన్‌లో ఉండాలని తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌ అన్నారు. రావులపల్లి రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు నుంచి ప్రతిరోజూ 500లకు పైగా వస్తున్నారని తెలిపారు. బుధవారం  450కి పైగా వచ్చారని, ఆరుగురు ఇక్కడి నుంచి వెళ్లారని చెప్పారు. కొడంగల్‌ మండలంలోని ఆయా గ్రామాలకు 147 మంది చేరుకున్నారని తెలిపారు.

సొంత ప్రాంతాలకు వలస కూలీలు

తాండూరు : తాండూరు పరిధిలో ఉన్న  మహారాష్ట్రలకు చెందిన 51మంది వలస కూలీలను తాండూరు రూరల్‌ సీఐ జలంధర్‌రెడ్డి, లింగంపల్లి రైల్వేస్టేషన్‌ వరకు తీసుకువెళ్లారు. వారు అక్కడి నుంచి ప్రత్యేక రైల్లో  ప్రాంతాలకు వెళ్లనున్నారు.


logo