శుక్రవారం 14 ఆగస్టు 2020
Vikarabad - May 13, 2020 , 00:37:42

లాక్‌డౌన్‌ ఆంక్షలు కఠినతరం

లాక్‌డౌన్‌ ఆంక్షలు కఠినతరం

వికారాబాద్‌ : నియోజకవర్గంలో లాక్‌డౌన్‌ నిబంధనలను అధికారులు కఠినంగా అమలు చేస్తున్నారు. మంగళవారం వికారాబాద్‌ పట్టణంలో కిరాణం షాపు లు, మెడికల్‌, భవన నిర్మాణ, వ్యవసాయ రంగాలకు సంబంధించిన దుకాణాలు తప్ప మిగతా   అధికారులు మూసివేయించారు. జిల్లా కేంద్రంలో  కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టడంతో గతంలో అధికారులు లాక్‌డౌన్‌లో సడలింపులు చేశారు. మొదట  దుకాణాలకు మాత్రమే అనుమతి ఇవ్వగా.. క్రమక్రమంగా  షాపులు  పూర్తి స్థాయిలో వ్యాపార కార్యకలాపాలు కొనసాగించాయి.  ఱోపజలు  సంఖ్యలో రోడ్లపైకి రావడం, దుకాణాల వద్ద  దూరం పాటించకపోవడంతో  అధికారులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు.  అనవసరంగా వచ్చే వారిని పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపిస్తున్నారు.  చర్యలతో ప్రజలు బ్యాంకుల వద్ద భౌతిక దూరం పాటిస్తూ క్యూలో నిల్చున్నారు. మధ్యాహ్నం వేళ ఎండ ఎక్కువ కావడంతో వరుసలో  పెట్టి  వేచి ఉన్నారు. మరోవైపు లాక్‌డౌన్‌ సడలింపుతో లోపభుత్వ కార్యాలయాలు తెరుచుకుని కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఉద్యోగులు భౌతిక దూరం  మాస్కులను ధరించి  అందిస్తున్నారు. రిజిస్ట్రేషన్లు, రవాణా, ఎక్సైజ్‌ శాఖ కార్యాలయాల్లోని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. 

తాండూరులో మూసిన దుకాణాలు 

తాండూరు : లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించకపోవడంతో మంగళవారం నుంచి అత్యవసర సేవలు, నిత్యావసర దుకాణాలు మినహా మిగతావన్నీ మూసివేయాలని కలెక్టర్‌ పౌసుమి  ఆదేశాలు జారీ చేశా రు. దీంతో మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో తాండూరులో దుకాణాలను తెరువకుం డా సిబ్బంది చర్యలు చేపట్టారు. మళ్లీ ఆదేశాలు వచ్చే వరకు తీయవద్దని సూచించారు.


logo