ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - May 12, 2020 , 00:36:52

పేదింటి ఆడబిడ్డలకు సర్కారు అండ

పేదింటి ఆడబిడ్డలకు సర్కారు అండ

  • ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి

తాండూరు : రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. తాండూరు మున్సిపల్‌ పరిధిలో 69మంది, పెద్దేముల్‌ మండల పరిధిలో 17మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు సోమవారం చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలను చేపట్టిందని, అందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న, జడ్పీటీసీ గౌడి మంజుల, పెద్దేముల్‌ ఎంపీపీ అనూరాధ, జిల్లా పశుగ్రామీణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ నారాయణరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

కోట్‌పల్లి : తహసీల్దార్‌ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నల్లోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ భరత్‌గౌడ్‌, సర్పంచ్‌ విజయలక్ష్మి, ఎంపీటీసీ సుజాత, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మంజుల, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు ఎల్‌.మల్లేశం పాల్గొన్నారు. 


logo