గురువారం 13 ఆగస్టు 2020
Vikarabad - May 12, 2020 , 00:36:53

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

  • కలెక్టర్‌ పౌసుమి బసు, ఎమ్మెల్యే ఆనంద్‌
  • వికారాబాద్‌లో పట్టణ ప్రగతి పనుల పరిశీలన  

వికారాబాద్‌ : ప్రతిఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్‌ పౌసుమి బసు అన్నారు. మున్సిపల్‌ పరిధిలోని చెంచుకాలనీలో కలెక్టర్‌, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ సోమవారం పర్యటించి మరుగుదొడ్ల నిర్మాణం, చెత్త సేకరణ, మిషన్‌ భగీరథ నీటి సరఫరా, మురికి కాల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ లాక్‌డౌన్‌ ఎత్తివేయగానే పెండింగ్‌లో ఉన్న మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని కౌన్సిలర్‌కు సూచించారు. రోడ్లపై చెత్త పేరుకుపోతుందని కాలనీవాసులు కలెక్టర్‌ దృష్టికి తేగా.. సమస్యను పరిష్కరించాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. కాలనీలో మురుగు కాల్వలను మున్సిపల్‌ సిబ్బందితో శుభ్రం చేయించారు. బోరు నీటిని తాగొద్దని, మిషన్‌ భగీరథ నీటిని తాగాలని సూచించారు. ఎమ్మెల్యే ఆనంద్‌ మాట్లాడుతూ కాలనీని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అధికారులతోపాటు ప్రజలదేనని అన్నారు. పొలాల్లో పనులు చేసుకునేటప్పుడు భౌతిక దూరం పాటించి, మాస్కులు ధరించాలని సూచించారు. అనంతరం చెంచుకాలనీలో ఉంటున్న 52 కుంటుంబాలకు కలెక్టర్‌, ఎమ్మెల్యే నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వికారాబాద్‌ ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, డీటీడీవో కోఠాజీ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిగుళ్లపల్లి మంజుల, మున్సిపల్‌ కమిషనర్‌ భోగేశ్వర్లు, కౌన్సిలర్‌ అంబోతు దేవి పాల్గొన్నారు. logo