గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - May 12, 2020 , 00:36:54

జిల్లాకు 6118 మంది వలస కార్మికులు

జిల్లాకు 6118 మంది వలస కార్మికులు

  • మహారాష్ట్ర, కర్ణాటక నుంచి రావులపల్లి చెక్‌పోస్టు  రాక
  • రోజుకు వెయ్యి మంది చొప్పున సొంతూళ్లకు పయనం
  • పంపేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు
  • త్వరలో వికారాబాద్‌ నుంచి ప్రత్యేక రైలు
  • ఇప్పటికే వెయ్యి మంది కాలినడకన స్వస్థలాలకు..
  • జిల్లాకు చెందిన కార్మికులు 2125మంది

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ  లాక్‌డౌన్‌తో   సొంతూళ్లకు వస్తున్నారు.  మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలకు వెళ్లిన తెలంగాణవాసులు  మండలం రావులపల్లి అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు మీదుగా చేరుకుంటున్నారు.  చెందిన వలస కార్మికులతోపాటు మరో 16 జిల్లాలకు చెందినవారు సోమవారం  6118 మంది   అత్యధికంగా వికారాబాద్‌, నారాయణపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన వారున్నారు. ఎక్కువ మంది ఆయా రాష్ర్టాలు ఏర్పాటు చేసిన బస్సులు, ప్రత్యేక వాహనాల్లో వస్తుండగా.. మరికొందరు ద్విచక్ర వాహనాలపై పుణె, థానే ప్రాంతాల నుంచి వస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. అయితే.. రావులపల్లి చెక్‌పోస్టు మీదుగా వస్తున్న కార్మికుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా  బందోబస్తు పెట్టి కూలీల పూర్తి వివరాలను  శాఖ అధికారులు సేకరిస్తున్నారు. అదేవిధంగా చెక్‌పోస్టు వద్ద ప్రతి ఒక్కరికీ  స్కీనింగ్‌తో  పరిస్థితిని తెలుసుకుంటున్నారు. 

జిల్లాకు 2125 మంది 

మహారాష్ట్రలోని ముంబయి, పుణె, థానే ప్రాంతాలకు వలస వెళ్లిన జిల్లావాసులు తిరిగి సొంతూళ్లకు వస్తున్నారు.  చెక్‌పోస్టు మీదుగా జిల్లాకు 2125 మంది   అత్యధికంగా కులకచర్ల, దోమ, బొంరాస్‌పేట్‌, దౌల్తాబాద్‌ మండలాలకు చెందినవారున్నారు. కులకచర్ల మండలానికి 754 మంది, దోమ మండలానికి 475, బొంరాసుపేట్‌కు 435, దౌల్తాబాద్‌కు 200, బషీరాబాద్‌కు  కొడంగల్‌కు 53, పరిగికి 43, యాలాలకు  పెద్దేముల్‌కు  తాండూరుకు 7,   వికారాబాద్‌ మండలానికి ఇద్దరు, పూడూర్‌ మండలానికి ఒక్కరు వచ్చారు.   వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయడంతోపాటు ఆయా మండలాలకు చేరుకున్న అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి  హోం క్వారంటైన్‌  

వలస కార్మికుల కోసంప్రత్యేక రైలు

వివిధ రాష్ర్టాల నుంచి జిల్లాకు వచ్చిన వలస కార్మికులను  పంపేందుకు జిల్లా ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ఉన్నతాధికారులతో జిల్లా అధికారులు చర్చించారు. త్వరలో ఆయా రాష్ర్టాలకు పంపనుండగా..  వివరాలను పోలీసు స్టేషన్లలో సేకరిస్తున్నారు. ఇప్పటివరకు బీహార్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, పశ్చిమబెంగాల్‌, ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, అసోం, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌ రాష్ర్టాలు, అండమాన్‌ నికోబార్‌కు చెందిన 1764 మంది సొంతూళ్లకు వెళ్లేందుకు రిజిస్టర్‌ చేసుకున్నారు.  వెయ్యి మంది కాలినడకన వారి రాష్ర్టాలకు వెళ్లినట్లు ఎస్పీ ఎం.నారాయణ వెల్లడించారు. అయితే జిల్లాలో మొత్తం 8588 మంది ఇతర రాష్ర్టాలకు చెందిన వలస కార్మికులున్నారు.  బీహార్‌కు చెందిన వలస కార్మికులు 1561 మంది, ఆంధ్రప్రదేశ్‌-1364 మంది, ఉత్తరప్రదేశ్‌-1043, కర్ణాటక-950, ఒడిశా-864, మహారాష్ట్ర-845, జార్ఖండ్‌కు చెందిన కార్మికులు 475 మంది ఉన్నారు. 

మండలానికి చేరుకున్న వలస కూలీలు

కులకచర్ల : పుణె, ముంబయి నగరాల  బిందెంగడ్డతండాకు 52మంది, రోకటిగుట్టతండాకు  చెరువుముందలితండాకు 53, టేకులతండాకు 15, ఎత్తుకాల్వతండాకు 31మంది వలస కూలీలు బస్సుల, వివిధ వాహనాల ద్వారా సోమవారం చేరుకున్నారు. పోలీసులు, ప్రభుత్వ అధికారులు, వైద్య సిబ్బంది తండాల్లోకి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. 28రోజుల పాటు ఇంట్లో నుంచి వెళ్లకూడదని సూచించారు. logo