మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - May 11, 2020 , 01:37:20

భారీగా తరలివస్తున్న వలస కూలీలు

భారీగా తరలివస్తున్న వలస కూలీలు

బొంరాస్‌పేట/దోమ : కొడంగల్‌ మండలంలోని రావులపల్లి చెక్‌పోస్టు ద్వారా ఆదివారం ఒక్కరోజే 719మంది వలస కూలీలు రాష్ట్రంలోకి ప్రవేశించారు. స్వస్థలాలకు వెళ్లడానికి కేంద్రం అనుమతించడంతో ముంబయి, పుణె నుంచి తిరుగుముఖం పడుతున్నారు. కూలీల వివరాలను నమోదు చేసుకున్న అధికారులు క్వారంటైన్‌ ముద్రలు వేసి స్వీయ గృహ నిర్బంధంలో ఉండాలని సూచించారు. కూలీల్లో కొడంగల్‌ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు. బొంరాస్‌పేట మండలానికి చెందిన టీటీ రాములు వలస కూలీలకు భోజన వసతి కల్పించారు. అలాగే గాజులకుంట తండాకు 23మంది కూలీలు రాగా వారందరినీ హోంక్వారంటైన్‌ చేశారు.

మహారాష్ట్ర నుంచి కూలీల రాక..

దోమ మండల పరిధిలోని మైలారం గ్రామానికి మహారాష్ట్ర నుంచి 58మంది వలస కూలీలు రావడంతో ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్‌ మునీబ్‌ గ్రామానికి వెళ్లి వైద్య పరీక్షలు చేసి, అందరూ 28రోజులు హోంక్వారంటైన్‌లో ఉండాలని కూలీలకు సూచించారు. logo