బుధవారం 05 ఆగస్టు 2020
Vikarabad - May 10, 2020 , 01:12:04

సడలింపు సందడి

సడలింపు సందడి

  • తెరుచుకున్న వ్యాపార సముదాయాలు
  • రద్దీగా మారిన రహదారులు

వికారాబాద్‌ నెట్‌వర్క్‌: లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించడంతో రోడ్లపై సందడి మొదలైంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతివ్వడంతో వ్యాపారాలు కూడా పుంజుకుంటున్నాయి. మండల కేంద్రాలు, గ్రామాల్లో పూర్తిస్థాయిలో, మున్సిపాలిటీ పరిధిలో సరి-బేసి విధానంతో షాపులను తెరుస్తున్నారు. రహదారులు ఎప్పటిలాగే రద్దీగా దర్శనమిస్తున్నాయి. కాగా తాండూరు పట్టణంలోని బసవణ్ణ కట్ట ప్రాంతంలో ఓ పండ్ల వ్యాపారి మాస్కు ధరించకపోవడంతోపాటు నిబంధనలు పాటించకపోవడంతో అధికారులు రూ. వెయ్యి జరిమానా విధించారు. గంజ్‌ మార్కెట్‌ సమీపంలోని ఓ కిరాణా దుకాణం వద్ద భౌతిక దూరం పాటించకపోవడంతో వ్యాపారికి రూ. 2వేల జరిమానా వేశారు. పరిగి పట్టణ పరిధిలో నిబంధనలు పాటించని ఇద్దరు దుకాణ యజమానులకు రూ. వెయ్యి చొప్పున, వికారాబాద్‌ టౌన్‌లో నిబంధనలు ఉల్లంఘించిన వైన్స్‌షాపు నిర్వాహకుడికి రూ. 5వేల జరిమానా వేశారు. మరోవైపు జిల్లావ్యాప్తంగా అనేకచోట్ల పలువురు దాతలు పేదలకు నిత్యావసర సరుకులు, మాస్కులు అందజేశారు. వికారాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో అధికారులు యజమానుల నుంచి జరిమానాలు వసూలు చేసి వాహనాలను వదిలేశారు.


logo