గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - May 10, 2020 , 01:12:05

రైతులు సద్వినియోగం చేసుకోవాలి

రైతులు సద్వినియోగం చేసుకోవాలి

బషీరాబాద్‌ /పరిగి : రైతులు కోనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని బషీరాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ అరుణ గోపాల్‌రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని మైల్వార్‌, అల్లాపూర్‌ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను ఆమె సందర్శించారు. కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ డైరెక్టర్‌ హన్మంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు పాండురంగారెడ్డి ఉన్నారు. అలాగే పరిగి మండలంలోని లఖ్నాపూర్‌లో ఎంపీపీ కె.అరవిందరావు, జడ్పీటీసీ బి.హరిప్రియ, పీఏసీఎస్‌ చైర్మన్‌ కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.  

ఇబ్బందులు పడకుండా చూడాలి..

వికారాబాద్‌ రూరల్‌ : కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులను తహసీల్దార్‌ రవీందర్‌ ఆదేశించారు. శనివారం ఆయన పట్టణంలోని డీసీఎంఎస్‌ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట ఏఈవో అనిల్‌, డీసీఎంస్‌ఎస్‌ అధికారి సుదర్శన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.logo