ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - May 06, 2020 , 00:17:53

మద్యం దుకాణాల్లో తనిఖీ

మద్యం దుకాణాల్లో తనిఖీ

తాండూరు రూరల్‌ : జిల్లా ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్సు అధికారులు మంగళవారం మద్యం దుకాణాలను తనిఖీ చేశారు. తాండూరు నియోజకర్గంలోని తాండూరు పట్టణం,  బషీరాబాద్‌, పెద్దేముల్‌ మండలాల్లోని మద్యం దుకాణాల్లో  పరిశీలించారు. క్లోజింగ్‌, ఓపెనింగ్‌ స్టాక్‌ను పరిశీలించినట్లు టాస్క్‌ఫోర్సు సీఐ ధనంత్‌రెడ్డి తెలిపారు. తాండూరు మండలంలోని కరణ్‌కోట, మల్కాపూర్‌లలో మద్యం దుకాణాలను తనిఖీలు చేశారు.  దుకాణాలను మళ్లీ సీజ్‌ చేశారు.

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : లాక్‌డౌన్‌తో  మూసి ఉన్న వైన్స్‌ షాపుల్లో  నిల్వలపై ్టపభుత్వం ఆరా తీస్తుంది. రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు  ఎక్సైజ్‌ అధికారులు వికారాబాద్‌లోని మద్యం దుకాణాల్లో మంగళవారం  చేశారు.  నిల్వలను పరిశీలించారు. ఇదిలాఉండగా, షాపులు మూసి ఉన్నప్పటికీ మద్యం  మార్కెట్‌లో అమ్మిన వైన్స్‌ యజమానుల్లో కలవరం మొదలైంది.  శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఎలా ఇస్తారోనని గుబులు పడుతున్నారు. 

కొడంగల్‌, నమస్తే తెలంగాణ : పట్టణంలోని మూడు మద్యం దుకాణాలను ఎక్సైజ్‌ సీఐ శివయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. 40 రోజులుగా  ఉన్న దుకాణాలను  స్టాక్‌ను పరిశీలించి మళ్లీ సీల్‌ వేశారు.


logo