సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - May 06, 2020 , 00:20:40

గ్రామాల్లోనే ధాన్యం కొనుగోళ్లు

గ్రామాల్లోనే ధాన్యం కొనుగోళ్లు

  • ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి

కొడంగల్‌, నమస్తే తెలంగాణ : రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం గ్రామాల్లోనే  కొనుగోలు చేస్తుందని కొడంగల్‌  పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు.  రావులపల్లి గ్రామంలో సర్పంచ్‌ రమేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.  టేకల్‌కోడ్‌, రుద్రారం, పాటుమీదిపల్లి గ్రామాల్లో రెండో విడుత బియ్యం పంపిణీని ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   మందు లేదన్నారు.   పాటిస్తూ.. ఇంట్లోనే ఉండి కరోనా కట్టడికి పాటుపడాలని సూచించారు. పేదలకు ఆహార ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఒక్కొక్కరికి ఉచితంగా 12కిలోల బియ్యం, కుటుంబానికి   చెప్పారు.  కొనుగోళ్ల కోసం జిల్లాకు రూ.45 కోట్లు మంజూరయ్యాయని, రెండు, మూడ్రోజుల్లో రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారని   స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతులివ్వాలని ఉత్తర్‌ప్రదేశ్‌ వలస కూలీలు ఎమ్మెల్యేను కోరగా, అందుకు కృషి చేస్తానని హామీఇచ్చారు.   ముద్దప్ప దేశ్‌ముఖ్‌, ఎంపీడీవో సుజాత, సర్పంచ్‌లు గుండప్ప, బాలమణి, గోవింద్‌, అనిత, మున్సిపల్‌ కౌన్సిలర్‌ మదుసూధన్‌యాదవ్‌, కోఆప్షన్‌ సభ్యులు ముక్తార్‌ పాల్గొన్నారు. 

కొనుగోలు వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

కులకచర్ల : పుట్టపపహాడ్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు  చంద్రయ్య పరిశీలించి  వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. అనంతరం గ్రామ సమీపంలో ఉపాధిహామీ పనులను పరిశీలించి కూలీలకు మాస్కులు ధరించాలని సూచించారు. నర్సరీలో మొక్కలను సంరక్షించేందుకు రోజూ రెండు సార్లు నీళ్లు పట్టాలని  ఆదేశించారు. ఆయన వెంట  ఇన్‌చార్జి ఎంపీడీవో సుందర్‌లాల్‌, ఏపీవో మల్లికార్జున్‌, ఈసీ చంద్రశేఖర్‌, సర్పంచ్‌ అంజిలమ్మ ఉన్నారు. 

రైతులకు ఇబ్బంది కలిగించొద్దు

దోమ : కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ అన్నారు. మండల కేంద్రంలోని  కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. కేంద్రాల్లో ధాన్యం నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు తరలించాలన్నారు. ఆయన వెంట పీఏసీఎస్‌ సీఈవో యాదగిరి, ఏఈవో కావ్య పాల్గొన్నారు.


logo