ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - May 06, 2020 , 00:17:51

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే పంటలు విక్రయించాలి

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే పంటలు విక్రయించాలి

  • చేవేళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి

పరిగి, నమస్తే తెలంగాణ : రైతులు వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని చేవేళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. పరిగి మండలం పేటమాదారంలో మంగళవారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రా న్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు లు పండించిన పంటను విక్రయించుకోవడానికి ప్రభుత్వం ఊ రూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు.  కార్యక్రమంలో ఎంపీపీ కె.అరవిందరావు, జడ్పీటీసీ బి.హరిప్రియ, పీఏసీఎస్‌ చైర్మన్‌ కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ ఏడీ వీరప్ప, డీసీఎంఎస్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ శ్యాంసుందర్‌రెడ్డి పాల్గొన్నారు. దోమ మండల కేంద్రంలోని పీఏసీఎస్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి ప్రారంభించారు.

ఉనికి కోసమే కాంగ్రెస్‌ దీక్షలు

రాజకీయంగా తమ ఉనికిని చాటుకునేందుకే కాంగ్రెస్‌ నాయకులు దీక్ష చేస్తున్నారని ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు.  ఎమ్మెల్యే నివాసంలో  సమావేశంలో వారు మాట్లాడారు.  పాలనలో ఇంత పెద్ద మొత్తం లో ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేశారా అని ప్రశ్నించారు. రైతులు ఇబ్బందులు పడరాదనే ఉద్దేశంతో  కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

భౌతిక దూరం పాటించాలి

పూడూరు : భౌతిక దూరం పాటించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని ఎంపీ  రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో 53మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, ఐదుగురికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను అందజేశారు. అనంతరం నిరుపేదలకు నిత్యావసర వస్తువులు, శానిటైజర్లు, మాస్కులును ఎంపీ రంజిత్‌రెడ్డి ట్రస్టు ద్వారా అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మేఘమాల, తహసీల్దార్‌ దీపక్‌, ఎంపీడీవో ఉష, సర్పంచ్‌ నవ్యారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అజారుద్దీన్‌, ఎస్‌ఐ  పాల్గొన్నారు. 

లక్ష్మారెడ్డి కుటుంబానికి  పరామర్శ

పెద్దేముల్‌ : డీసీసీబీ మాజీ చైర్మన్‌, తట్టేపల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌ పి.లక్ష్మారెడ్డి కుటుంబాన్ని ఎంపీ రంజిత్‌రెడ్డి పరామర్శించారు. గత నెల 26న లక్ష్మారెడ్డికి మాతృవియోగం కలుగగా, విషయం తెలుసుకున్న ఎంపీ వారి  వెళ్లి పరామర్శించారు. ఎంపీ వెంట ఉమ్మడి జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్‌చారి, లక్ష్మారెడ్డి తనయుడు మహిపాల్‌రెడ్డి ఉన్నారు.


logo