శుక్రవారం 07 ఆగస్టు 2020
Vikarabad - May 06, 2020 , 00:20:42

పాజిటివ్‌ టు నెగెటివ్‌

పాజిటివ్‌ టు నెగెటివ్‌

  • జిల్లాలో  కరోనా బాధితులు
  • ఇప్పటివరకు 28 మంది డిశ్చార్జ్‌
  • 9కి తగ్గిన యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులు
  • 14 రోజులుగా నమోదు కాని కేసులు
  • 8 కంటైన్‌మెంట్‌ జోన్లు ఎత్తివేత

జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ  జిల్లాలో కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టింది. గత నెలలో  నిర్ధారణ అయి దవాఖానలో  వారందరూ క్రమంగా  ఇంటికి చేరుకుంటున్నారు. చికిత్స పొంది కోలుకున్న వారికి గాంధీ దవాఖాన వైద్యులు రెండు సార్లు నిర్వహించిన పరీక్షల్లో  రావడంతో  చేస్తున్నారు. మరోవైపు జిల్లాలో 14రోజులుగా ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. దీంతో కంటైన్‌మెంట్‌ జోన్లను ఎత్తివేశారు.

గత నెల 15నుంచి  తేదీ వరకు వరుసగా జిల్లా కేంద్రంలోని రిక్షా కాలనీలోనే 19 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యా యి. అనంతరం జిల్లావ్యాప్తంగా 38 మందికి వైరస్‌ సోకింది. ఇందులో జిల్లా కేంద్రంలోనే 31 పాజిటివ్‌ కేసులు ఉండగా.. తాండూరులో నలుగురు, పరిగిలో ఇద్దరు, మర్పల్లి మండల కేంద్రంలో ఒకరు వైరస్‌ బారిన పడ్డారు.  జిల్లా కేంద్రానికి చెందిన 65 ఏండ్ల వ్యక్తి మృతిచెందగా, మిగతా వారంద రూ గాంధీ దవాఖానలో  పొందారు.  గత నెల 21 నుంచి కొవిడ్‌-19 నుంచి కోలుకోవడం ప్రారంభమైంది. రోజు కు ఇద్దరు, ముగ్గురు చొప్పున ఇంటికి చేరుకుంటున్నారు. ఇప్పటి వరకు డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 28కి పెరిగింది.  తొమ్మిది మంది చికిత్స పొందుతున్నారు.  జిల్లాలో ప్రస్తుతం సాధారణ గృహ నిర్బంధంలో 12,463 మంది ఉండ గా, 28రోజుల గృహ నిర్బంధాన్ని 10,038 మంది పూర్తి చేసుకున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ క్వా రంటైన్‌ కేంద్రాల నుంచి 86మందిని డిశ్చార్జ్‌ చేయగా, మరో 60మంది క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉన్నారు. విదేశాల నుంచి వచ్చిన 168 మంది 14రోజుల క్వారంటైన్‌ పూర్తి చేసుకొని డిశ్చార్జ్‌ అయినట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు.

‘సీ’ జోన్లు ఎత్తివేత..

పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయిన ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించి ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాకుండా చేసిన అధికారులు.. వైరస్‌ ప్రభావం తగ్గడంతో ‘సీ’ జోన్లను ఎత్తివేశారు.  కేంద్రంలో మూడు కంటైన్‌మెంట్‌ జోన్లను, తాండూరు మున్సిపాలిటీలో రెండు, పరిగి మున్సిపాలిటీలో రెండు, మర్పల్లి మండల కేంద్రంలో ఒక ‘సీ’ జోన్‌ను ఎత్తివేశారు.  రిక్షా కాలనీలో అధిక పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో  అక్కడ మాత్రమే కంటైన్‌మెంట్‌ జోన్‌ను కొనసాగిస్తున్నారు.


logo