శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Vikarabad - May 04, 2020 , 01:01:51

మీకు అండగా మేమున్నాం..

మీకు అండగా మేమున్నాం..

  • జిల్లావ్యాప్తంగా పలుచోట్ల పేదలకు సరుకులు, కూరగాయలు అందజేసిన దాతలు

పరిగి, నమస్తే తెలంగాణ /జిల్లా నెట్‌వర్క్‌ : జిల్లాలో లాక్‌డౌన్‌ ప్రశాంతంగా కొనసాగుతున్నది. పోలీసులు ప్రజలెవరూ నిబంధనలు ఉల్లంఘిచకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. మరోవైపు కష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఆదివారం పరిగిలో అక్షయ ఫైనాన్స్‌ ఆధ్వర్యంలో ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లకు నిత్యావసర సరుకులు అందజేశారు. మున్సిపల్‌ చైర్మన్‌ ముకుంద అశోక్‌, జడ్పీటీసీ హరిప్రియ, ఎంపీపీ అరవిందరావు ఉపాధి హామీ సిబ్బందికి సరుకులను పంపిణీ చేపట్టారు. పరిగికి చెందిన కానిస్టేబుల్‌ యాదోజీ, డీసీఎంఎస్‌లో పనిచేసే సంతోష్‌, వెంకట్‌, ఏఈవోలు కావ్య, ప్రసన్న తమ స్నేహితుల సహాయంతో పరిగిలో 65 నిరుపేద కుటుంబాలకు డీఎస్పీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సరుకులు ఇచ్చారు. కార్యక్రమాలలో టీఆర్‌ఎస్‌ నాయకులు బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎ.సురేందర్‌కుమార్‌, వైస్‌ ఎంపీపీ సత్యనారాయణ, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ ఎస్‌.భాస్కర్‌, అక్షయ ఫైనాన్స్‌ డైరెక్టర్లు కామేశ్‌రెడ్డి, నర్సింహులు గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే వికారాబాద్‌ మున్సిపాలిటీ 32వ వార్డులో కౌన్సిలర్‌ నవీన్‌ కూరగాయలు పంపిణీ చేశారు. మోమిన్‌పేట మండలంలో కొత్తకోల్కుందలో వాసవి అసోసియేషన్‌ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ఎన్‌ఆర్‌ఐ వాసవి అసోసియేషన్‌ మిత్ర బృందం సహకారంతో గ్రామాన్ని దత్తత తీసుకొని ఒక్కో కుటుంబానికి రూ.500 విలువైన సరుకులను పంపిణీ చేశారు. దోమ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా నాయకులు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు, పోలీసు సిబ్బందికి పండ్లు అందజేశారు. బొంరాస్‌పేట మండలంలోని బొంరాస్‌పేట, తుంకిమెట్ల, నాందార్‌పూర్‌, హకీంపేట, పోలేపల్లి, రాంనాయక్‌తండాల్లో పారిశుధ్య కార్మికులు,  పేదలకు కిసాన్‌బంధు, విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నిత్యావసరాలను పంపిణీ చేశారు.


logo