మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - May 01, 2020 , 01:31:02

వేటాడితే కఠిన చర్యలు

వేటాడితే కఠిన చర్యలు

  • వికారాబాద్‌ రేంజ్‌ అధికారి బాలయ్య

పూడూరు: దామగుండం అడవిలో వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటామని వికారాబాద్‌ రేంజ్‌ అధికారి కె.బాలయ్య హెచ్చరించారు. డీఎఫ్‌వో ఆదేశాల మేరకు గురువారం పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో ఫారెస్ట్‌ అధికారులు రెండు గ్రూపులుగా ఏర్పడి పర్యటించారు. వాహనాలను ఆపి తనిఖీలు చేశారు. అనంతరం పూడూరు గ్రామంలో రేంజ్‌ అధికారి బాలయ్య మాట్లాడుతూ గ్రామస్తులు ఎవరూ అడవిలోకి రావద్దని సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి కొందరు వ్యక్తులు ఉచ్చులు, వలలు, కుక్కలతో వచ్చి వన్యప్రాణులను వేటాడుతున్నారనే సమాచారంతో అడవిలో గస్తీ నిర్వహిస్తునట్లు తెలిపారు. ఎవరైనా వేటాడినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. వారి వెంట నాయకులు నర్సింహారెడ్డి, మల్లేశం, అనంతరాములు, ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారులు పాండు, డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్లు రవికుమార్‌, ఫరీద్‌, సెక్షన్‌ ఆఫీసర్లు అరుణ, ప్రవీణ్‌కుమార్‌, యూసుఫ్‌, మధుకర్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.


logo