బుధవారం 05 ఆగస్టు 2020
Vikarabad - Apr 27, 2020 , 00:49:58

ఘనంగా బసవేశ్వర జయంతి

ఘనంగా బసవేశ్వర జయంతి

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : మహాత్మ బసవేశ్వర 887వ జయంతిని  ఆదివారం  నిర్వహించారు.    ఎంఆర్‌పీ చౌరస్తాలో   విగ్రహానికి వికారాబాద్‌, చేవెళ్ల ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, కాలె యాదయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం  మాట్లాడుతూ బసవేశ్వరుడు సమాజానికి ఎంతో సేవ చేసి మహాత్ముడిగా నిలిచాడని కొనియాడారు. వీరశైవ సమా జం సభ్యులు, పలువురు యువకులు బసవేశ్వరుడి విగ్రహానికి  సమర్పించారు.  ము న్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల, వీరశైవ  సమా జం అధ్యక్షుడు పోలె సర్వేశం, గాండ్ల వీరేశం  

తాండూరు, నమస్తే తెలంగాణ : తాండూరు పట్టణంలోని బసవేశ్వరుడి విగ్రహానికి ఆర్డీవో వేణుమాధవరావుతోపాటు వీరశైవులు, నాయకులు  వేశారు. సేవా భారతి, వీరశైవ యువదళ్‌ ఆధ్వర్యంలో 50 మంది రక్తదానం చేశారు. అనంతరం సర్కారు దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

కొడంగల్‌, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ కార్యాలయంలో బసవేశ్వరుడి చిత్రపటానికి మున్సిపల్‌ చైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్లు పూలమాలలు వేశారు. 

బొంరాస్‌పేట :  కార్యాలయంలో బసవేశ్వరుడి చిత్రపటానికి  సమాజం సభ్యులు  అర్పించారు.

పరిగి, నమస్తే తెలంగాణ : నియోజకవర్గంలో  జయంతిని ఘనంగా నిర్వహించారు. పరిగిలోని బసవేశ్వరుడి విగ్రహానికి మున్సిపల్‌ చైర్మన్‌ ముకుంద అశోక్‌, వీరశైవ సమాజం సలహాదారు పటేల్‌ జగదీశ్వర్‌, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంజుల పూలమాలనివాళులు అర్పించారు. మాదారంలో బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజించారు. కులకచర్ల మండల కేంద్రంతోపాటు ఇతర గ్రామాల్లో    పూలమాలలు వేసి ఆరాధించారు.


logo