శుక్రవారం 14 ఆగస్టు 2020
Vikarabad - Apr 27, 2020 , 00:49:04

ఆంక్షల నుంచి ఊరట

ఆంక్షల నుంచి ఊరట

  • ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : కరోనా బారి నుంచి జిల్లా క్రమంగా కోలుకుంటున్నది.   దవాఖానలో   కోలుకొని ఇంటికి చేరుకుంటున్నారు. ఇటీవల కొత్త కేసులు నమోదు కాకపోవడంతో జిల్లా అధికారులు ఆంక్షలను కొంత మేర ఎత్తివేశారు. ఇంతకుముందు కరోనా పాజిటివ్‌ కేసులు ఒక్కసారిగా పెరుగడంతో జిల్లా కేంద్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించి..  సరుకులను ఇంటి వద్దకే సరఫరా చేశారు. ప్రస్తుతం పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టడంతో  జోన్‌ మినహా ఇతర ప్రాంతాల్లో ఉదయం 6నుంచి సాయంత్రం 6గంటల వరకు నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు సడలింపునిచ్చారు.  ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సడలింపుపై కలెక్టర్‌ పౌసుమి బసు శనివారం అర్ధరాత్రి ప్రకటన చేయగా, ప్రజలకు సరైన సమాచారం లేక ఆదివారం ఎక్కువగా రోడ్లపైకి రాలేదు. అయితే.. ఆదివారం కావడంతో  మటన్‌ షాపుల వద్ద రద్దీ కనిపించింది.   షాపుల  కొనుగోలుదారులు సామాజిక దూరం పాటించారు.  లేకుండా రోడ్లపైకి వచ్చిన వారిని పోలీసులు అడ్డుకుని తిరిగి వెనక్కి పంపించారు.   ధరించి, సామాజిక దూరం పాటించాలని సూచించారు. నిత్యావసరాలు, మెడికల్‌, అత్యవసర వైద్య సేవల నిమిత్తం మాత్రమే ప్రజలను బయటికి అనుమతిస్తున్నారు. నిత్యావసర సరుకుల కొనుగోలు సమయంలో సడలింపులు చేసినప్పటికీ ‘సీ’జోన్‌గా గుర్తించిన ప్రాంతాల నుంచి మాత్రం పోలీసులు ఎవరినీ బయటకు రానివ్వడం లేదు.‘సీ’జోన్‌ ప్రాంతాలకు మున్సిపల్‌ సిబ్బంది నిత్యావసర సరుకులను సరఫరా చేస్తున్నారు. ‘సీ’ జోన్‌ ్సపాంతాలను పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కాగా, మోమిన్‌పేట మండల కేంద్రంలో లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించిన ఆరుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

సరుకుల  12 గంటల సడలింపు

  • కలెక్టర్‌ పౌసుమి బసు

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ :  సరుకుల  12 గంటల సడలింపు ఇస్తున్నట్లు కలెక్టర్‌ పౌసుమి బసు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు.  6నుంచి సాయంత్రం 6గంటల వరకు నిత్యావసర సరుకులు విక్రయించే దుకాణాలు తెరిచి ఉంటాయని తెలిపారు.   మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ సరుకులు కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు.  కూడా  తప్పక పాటించాలని ఆదేశించారు. ద్విచక్ర వాహనాలపై ఒక్కరు, కారులో ఇద్దరు మాత్రమే ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తున్నామని   ఎక్కువ మంది ప్రయాణిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

మాస్కులు ధరించని 10మందికి జరిమానా 

పరిగి, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ కట్టడికి ప్రకటించిన లాక్‌డౌన్‌లో ఆదివారం  మేరకు ఆంక్షలు సడలించారు. దీంతో  పట్టణంలో ప్రజలు నిత్యావసర సరుకుల కొనుగోలుకు బయటకు వచ్చారు.  సందర్భంగా కిరాణా,మెడికల్‌ షాపులు, మాంసం    సామాజిక దూరం పాటించి  చేశారు. పరిగి నియోజకవర్గంలో ఆదివారం లాక్‌డౌన్‌ ప్రశాంతంగా కొనసాగింది.  ధరించకుండా బయటకు వచ్చిన  ఒక్కొక్కరికి రూ.100 చొప్పున మున్సిపల్‌ అధికారులు జరిమానా విధించారు.


logo