బుధవారం 05 ఆగస్టు 2020
Vikarabad - Apr 24, 2020 , 02:25:52

రంజాన్‌ దీక్షలను ఇండ్లలోనే జరుపుకోవాలి

రంజాన్‌ దీక్షలను ఇండ్లలోనే జరుపుకోవాలి

  • లాక్‌డౌన్‌ నిబంధనలు అందరూ పాటించాల్సిందే 
  • ముస్లిం మతపెద్దల సమావేశంలో ఎస్పీ నారాయణ

తాండూరు టౌన్‌ : ముస్లిం సోదరులు ఇండ్లలోనే ఉండి రంజాన్‌ దీక్షలను జరుపుకోవాలని, ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు అందరూ పాటించాల్సిందేనని ఎస్పీ నారాయణ పేర్కొన్నారు. గురువారం తాండూరు పట్టణం అంతారం రోడ్డు మార్గంలోని వైట్‌ ప్యాలెస్‌లో ముస్లిం మతపెద్దలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో పండుగలకు దూరంగా ఉండి ప్రాణాలను కాపాడుకోవడం ఉత్తమమన్నారు. కంటైన్‌మెంట్‌ జోన్‌ల కుదింపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయని స్పష్టం చేశారు. అప్పటివరకు అందరూ లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ రషీద్‌, తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐ రవికుమార్‌, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు. 


logo