మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Apr 08, 2020 , 02:24:19

సఫాయి.. నీకు సలాం

సఫాయి.. నీకు సలాం

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమల్లోకి తీసుకొచ్చి పకడ్బందీ చర్యలు చేపట్టింది. సొంత  సభ్యులే  ఇంట్లో ఉంటూ దూరం దూరంగా ఉండి మాట్లాడుకోవడం.. ఇతరులను ఇంట్లోకి రానివ్వని ప్రస్తుత పరిస్థితిలో  వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడంలో ప్రధానంగా వైద్య సిబ్బందితోపాటు సఫాయి కార్మికులు, పోలీసులు నిర్విరామంగా సేవలందిస్తున్నారు. వీరిలో సఫాయి కార్మికుల పాత్ర కూడా కీలకమని చెప్పవచ్చు. కంటికి కనపడని శత్రువుతో యుద్ధం చేస్తున్న  పరిస్థితుల్లో సఫాయి కార్మికులు పూపాణాలను సైతం లెక్క చేయకుండా విధులను నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మారికి ప్రపంచం మొత్తం భయపడిపోతున్నా సఫాయి కార్మికులు మాత్రం మొక్కవోని ధైర్యంతో తెల్లవారుజామునే విధులకు హాజరై పారిశుధ్య పనులు  ప్రజలందరి పాలిట సిఫాయిలుగా మారారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన పూపాంతాలకు  జంకుతున్న ఈ తరుణంలో  శుభ్రం చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈక్రమంలో వీరి సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. రూ.5వేల ప్రోత్సాహకం ప్రకటించింది. దీంతో  గ్రామపంచాయతీ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా కష్టాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ మా పాలిట దేవుడని పేర్కొంటున్నారు. 

జిల్లాలో 1,969 మంది సఫాయి కార్మికులు

జిల్లావ్యాప్తంగా 1,969 మంది సఫాయి కార్మికులు ఉన్నారు. వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల్లో 469 మంది పనిచేస్తుండగా, 565 గ్రామపంచాయతీల్లో 1,500 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు.  ణౌపతి  తెల్లవారుజామునుంచే రహదారులు, వీధులను  చెత్తను తొలగించడం, ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించడం, మురుగు కాల్వలను శుభ్రం చేయడం, కరోనా ప్రభావిత ప్రాంతాలతోపాటు అన్ని ప్రాంతాల్లో రసాయనాలు స్ప్రే చేయడం వంటి పనులు చేస్తున్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన ప్రాంతాల్లో నిత్యం ఆరేడు సార్లు బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం, రసాయనాలను స్ప్రే చేయడం, పారిశుధ్య పనులు చేస్తూ వైరస్‌ నిర్మూలనకు పాటుపడుతున్నారు.  రూ.5వేల చొప్పున ప్రభుత్వ ప్రోత్సాహకం అందనుంది.


logo