మంగళవారం 04 ఆగస్టు 2020
Vikarabad - Apr 07, 2020 , 00:50:15

కొనసాగుతున్న లాక్‌డౌన్‌

కొనసాగుతున్న లాక్‌డౌన్‌

  • ఇండ్లకే పరిమితమైన జనం
  • నిర్మానుష్యంగా రోడ్లు

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర బుపభుత్వాలు ప్రకటించిన  జిల్లాలో సంపూర్ణంగా కొనసాగుతున్నది. ప్రజలందరూ ఇండ్లకే పరిమితమవుతున్నారు.  వస్తువులు, కూరగాయల కోసం పరిమిత వేళల్లో తక్కువ సంఖ్యలో బయటకు వస్తున్నారు. దీంతో జనసంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.  లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనాలను పోలీసులు సీజ్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తున్నారు.  నిర్మూలనకు పలు గ్రామాల్లో  ద్రావణాన్ని పిచికారీ చేశారు. వికారాబాద్‌ నియోజకవర్గంలో  సోకిన వ్యక్తుల ఇండ్ల  కిలోమీటర్‌ మేర పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. రాజీవ్‌కాలనీ, మధుకాలనీల నుంచి ఎవరినీ బయటకు వెళ్లనీయకుండా  గస్తీ నిర్వహించారు. కాలనీవాసులకు అవసరమైన నిత్యావసర సరుకులను మున్సిపల్‌ సిబ్బంది సహాయంతో వారి ఇండ్లకు చేరవేస్తున్నారు. 

కలెక్టర్‌ పౌసుమి బసు సోమవారం మర్పల్లి మండల కేంద్రంలో   కరోనా సోకిన వ్యక్తి ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.  పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. వికారాబాద్‌ పట్టణంలోని ఫాతిమా అనాథాశ్రమం, యజ్ఞ ఫౌండేషన్‌, మహిమా అనాథాశ్రమాలకు ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ నిత్యావసర సరుకులు, కూరగాయలను పంపిణీ చేశారు.  మండల కేంద్రంలో పనిచేసే పారిశుధ్య సిబ్బందికి అధికారులు బూట్లు, మాస్కులు పంపిణీ చేశారు. మోమిన్‌పేట మండలం  గ్రామంలో పారిశుధ్య పనులను ఎంపీడీవో శైలజారెడ్డి పరిశీలించారు. కోట్‌పల్లి మండలం  మోత్కుపల్లి గ్రామాల సర్పంచ్‌లకు టీఆర్‌ఎస్‌ నాయకుడు వడ్ల నందు ఉచితంగా హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని, శానిటైజర్లను అందజేశారు. వికారాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో యాచకులు, పేదలకు ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ భోజనం ఏర్పాటు చేసి స్వయంగా వడ్డించారు. వికారాబాద్‌ పట్టణంలో భుఫెండ్స్‌ ఫర్‌ ఎవర్‌ మిత్ర బృందం సభ్యులు యాచకులకు భోజనం అందజేశారు.

కొడంగల్‌, నమస్తే తెలంగాణ :  కొడంగల్‌, బొంరాస్‌పేట, దౌల్తాబాద్‌ మండలాల్లో లాక్‌డౌన్‌ కట్టుదిట్టంగా అమలవుతుంది. సీఐ నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలో  పీఎస్‌ల పరిధిలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇంటి నుంచి బయటకు రావద్దని, సామాజిక దూరం పాటించాలని,  ధరించాలని అవగాహన కల్పిస్తున్నారు. బొంరాస్‌పేట ఎస్‌ఐ వెంకటశీను ఆధ్వర్యంలో జాతీయ రహదారితోపాటు ఇతర ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. కొడంగల్‌ మున్సిపాలిటీ 2వ వార్డు కౌన్సిలర్‌ మధుసూదన్‌యాదవ్‌ ఆశ కార్యకర్తలకు శానిటైజర్‌,  అందజేశారు. బొంరాస్‌పేట మండలం చౌదర్‌పల్లిలో పారిశుధ్య కార్మికులకు బూట్లు, సాక్సులు, చేతి గ్లౌజ్‌లు పంపిణీ చేశారు.

తాండూరులో హై అలర్ట్‌

తాండూరు, నమస్తే తెలంగాణ : తాండూరు పట్టణంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడంతో హై అలర్ట్‌ ప్రకటించారు.   శాంతినగర్‌, సాయిపూర్‌, ఆదర్శ తులసీనగర్‌, భవానీనగర్‌తోపాటు పలు కాలనీల్లో ఎక్కడికక్కడ బారికేడ్లు, కట్టెలు కట్టి ప్రజలను బయటకు రాకుండా పోలీసులు హెచ్చరిక చేశారు.  కూరగాయలు, నిత్యావసర వస్తువుల పంపిణీకి అధికారులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కాలనీలకు వాహనాల్లో  తీసుకెళ్లారు. 27వ వార్డులో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న దగ్గరుండి డీడీటీ మందు పిచికారీ చేయించారు. మరో వైపు మున్సిపల్‌, రెవెన్యూ, పోలీస్‌, అంగన్‌వాడీ సిబ్బందితోపాటు వైద్యులు ఇంటింటికీ తిరిగి కరోనా లక్షణాలేమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. 

పరిగి, నమస్తే తెలంగాణ : పరిగి నియోజకవర్గంలో లాక్‌డౌన్‌ ప్రశాంతంగా కొనసాగింది. పరిగి మున్సిపాలిటీ, దోమ, కులకచర్ల, పూడూరు మండలాల పరిధిలో ప్రజలు ఇండ్లల్లోనే ఉండిపోయారు. పరిగి మున్సిపాలిటీలో హై అలర్ట్‌ నేపథ్యంలో దుకాణాలన్నీ మూసివేశారు.  కేంద్రాల్లో కూరగాయలు, నిత్యావసర వస్తువుల కొనుగోలుకు అవకాశం కల్పించారు. పరిగిలోని ‘సీ’ జోన్‌ పరిధిలో శానిటైజర్‌ పిచికారీ చేపట్టారు.  మండల   కూలీలకు కొమ్మారెడ్డి శివకుమార్‌రెడ్డి ట్రస్ట్‌ చైర్మన్‌ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, హరీశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. 


logo