ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Apr 05, 2020 , 23:43:02

పకడ్బందీగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌

పకడ్బందీగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌

కొడంగల్‌, నమస్తే తెలంగాణ  కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు  రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ జిల్లాలో పకడ్బందీగా, ప్రశాంతంగా కొనసాగుతున్నది.ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యలతో ్వపజలు ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో     మరింత కట్టడి చేసేందుకు  మున్సిపాలిటీలో వారంలో మూడ్రోజులు మాత్రమే సరుకుల కొనుగోలుకు అధికారులు అనుమతిస్తున్నారు.   భాగంగా ఆదివారం స్థానిక మార్కెట్‌ యార్డులో కూరగాయలు,  విక్రయాలు చేపట్టారు.  బుధవారం వరకు అవకాశం ఉండదని భావించిన ప్రజలు మూడ్రోజులకు సరిపడా  కొనుగోలు చేశారు. ఈ నెల 14 తేదీ వరకు ఇలాగే సహకరించాలని పట్టణ సీఐ నాగేశ్వర్‌రావు ప్రజలను కోరారు.  నశింపజేసేందుకు మున్సిపాలిటీ పరిధిలో రసాయనాలు పిచికారీ చేస్తున్నారు.

తాండూరు, నమస్తే తెలంగాణ : తాండూరు పట్టణంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడంతో మున్సిపల్‌, రెవెన్యూ, పోలీస్‌ శాఖల ఆధ్వర్యంలో శాంతినగర్‌ కాలనీ ఏరియాలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కాలనీలో  మందు పిచికారీ చేశారు. ఢిల్లీకి వెళ్లొచ్చిన  ఎక్కడెక్కడ తిరిగాడు..? ఎవరెవరిని కలిశాడనే దానిపై విచారణ చేసి కుటుంబ సభ్యులతోపాటు పలువురిని గృహనిర్భందం చేశారు. అనుమానం ఉన్న వ్యక్తులు బయట తిరుగకుండా  వైద్యులను కలువాలని సూచించారు.  నూతన భవనంలో కరోనా గురించి ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు.

పరిగిలో అంతర్గత రోడ్లు  

పరిగి, నమస్తే తెలంగాణ : ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన ఓ వ్యక్తికి కరోనా  రావడంతో పరిగి పట్టణంలో 144 సెక్షన్‌ విధించారు. ఇండ్ల  ఎవరూ బయటకు రాకుండా తెల్లవారుజాము నుంచే ఎక్కడికక్కడ అంతర్గత రోడ్లను మూసివేశారు.  సరుకుల దుకాణాలు, కూరగాయల షాపులు  డీఎస్పీ శ్రీనివాస్‌ స్వయంగా పర్యవేక్షించారు.  సోకిన వ్యక్తి ఇంటి నుంచి అర కిలోమీటరు వరకు ప్రతి ఇంట్లో వారి ఆరోగ్య పరిస్థితులపై సర్వే చేపట్టారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో శానిటైజర్‌ స్ప్రే చేయించారు. మరోవైపు కరోనా బాధితుడితో  మాట్లాడిన వారిని గుర్తించి సుమారు 30 మందిని  క్వారంటైన్‌లో ఉంచినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. పట్టణ ప్రజలకు  సేవల కోసం పరిగిలోని ఉపాధిహామీ కార్యాలయాన్ని కంట్రోల్‌ రూమ్‌గా ఏర్పాటు చేశారు. కార్యాలయాన్ని అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రయ్య, ఆర్‌డీవో ఉపేందర్‌రెడ్డి సందర్శించారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు, పాలు ఇండ్లకే  చేసేందుకు పురపాలక సంఘం చర్యలు చేపట్టింది.  నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని కమిషనర్‌ తేజిరెడ్డి తెలిపారు. 

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : వైరస్‌ వ్యాప్తి చెందకుండా పట్టణ పరిధిలోని ఆలంపల్లిలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని స్వయంగా స్ప్రే చేశారు. మున్సిపల్‌ పరిధిలోని అన్ని వార్డుల్లో పిచికారీ చేయాలని  సూచించారు.ప్రతిఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని, చేతులను తరచూ  అన్నారు. కిరాణా షాపుల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించేలా యజమానులు చర్యలు తీసుకోవాలని సూచించారు. 

పేదలకు దాతల సాయం..

లాక్‌డౌన్‌ కారణంగా ఆహారం దొరుకని యాచకులు, పేదలకు పలువురు దాతలు భోజనం అందించారు. మోమిన్‌పేట మండలం  గ్రామంలో యువజన సంఘం సభ్యులు పేదలకు ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశారు. ధారూరు మండల కేంద్రంలో ఎంఐఎం పార్టీ మండలాధ్యక్షుడు మోహిజ్‌ ఖురేషి ఆధ్వర్యంలో  రాజశేఖర్‌ చేతుల మీదుగా నిరుపేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు. బంట్వారం మండలం  గ్రామంలో ఎంపీ రంజిత్‌రెడ్డి ఆర్థిక సహకారంతో రంజిత్‌ రెడ్డి యువసేన సభ్యులు పేదలకు కూరగాయలు, పండ్లు పంపిణీ చేశారు. బొంరాస్‌పేట మండలంలోని బొంరాస్‌పేట, హంసాన్‌పల్లి గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ నాయకుడు టీటీ రాములు కొవ్వొత్తులు పంపిణీ చేశారు. అనంతరం బొంరాస్‌పేటలో పాత్రికేయులకు కూరగాయలు   మండలం ద్యాచారం, జైదుపల్లి, గోధుమగూడ, గొట్టుముక్ల, ఐనాపూర్‌, పాతూరు తదితర గ్రామాల సర్పంచ్‌లకు  నాయకుడు వడ్ల నందు హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని, శానిటైజర్లను అందజేశారు.


logo