శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Vikarabad - Apr 05, 2020 , 23:41:38

కరోనా ప్రమాద ఘంటికలు!

కరోనా ప్రమాద ఘంటికలు!

రంగారెడ్డి జిలా ్లప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో కరోనా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. శనివారం వరకు 22 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా..ఒకరు మృతి చెందారు. ఆదివారం కొత్తగా మరో 4 పాజిటివ్‌ కేసులు న మోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా ఆదివారం వరకు 26 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక చేగూరు ఘటనలో మొత్తం 97మందిని క్వారంటైన్‌ చేశారు. అంత్యక్రియల్లో పాల్గొన్న వారితో సన్నిహితంగా ఉన్నామని ఏకంగా 45మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఇందులో ఐదుగురికి గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, జలుబు ఉండడంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉం డడంతో వారిని ప్రత్యేకంగా ఐసోలేషన్‌ చేశారు. ఇందులో ప్రధానంగా 65 ఏండ్ల మహిళకు చాలా ఇబ్బందిగా ఉన్నట్లు తెలిసింది. అలాగే షాద్‌నగర్‌, చేగూరు గ్రామాలకు చెందిన మరో ఇద్దరు అనుమానితులను ఆదివారం క్వారంటైన్‌కు తరలించారు. ఈనెల 20న షాద్‌నగర్‌లోని వెంకటేశ్వర కాలనీలో ఉండే ఓ వ్యక్తి ఢిల్లీ మర్కత్‌ ‘నిజాముద్దీన్‌' యాత్ర ముగించుకుని తిరిగొచ్చాడు. విషయం బయట తెలియకుం డా కుటుంబసభ్యులు గోప్యంగా ఉంచారు. షాద్‌నగర్‌లో వైద్య సిబ్బంది, ఆశావర్కర్లు ఇంటింటి సర్వేలో ఈ విషయం బయటపడింది. అలాగే మృతురాలి కుమారుడుతో సన్నిహితంగా ఉన్న చేగూరుకు చెందిన ఓ యువకుడ్ని జిల్లా వైద్యాధికారులు రాజేంద్రనగర్‌లో ఏర్పాటు చేసిన జిల్లా క్వారంటైన్‌కు తరలించారు. వీరిద్దరికీ 14రోజుల పాటు ఐసోలేషన్‌, క్వారంటైన్‌లో చికిత్స అందించనున్నారు. అయితే ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తోందనే ముందస్తు జాగ్రత్తతో అధికారులు పనిచేస్తున్నారు. అయితే ఇప్పటికే కరోనావ్యాధి సోకి చికిత్స పొందిన జిల్లాలోని కొత్తపేట్‌, కోకాపేట్‌కు చెందిన వ్యక్తులను డిశార్జి చేసిన్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి ‘నమస్తే తెలంగాణ’తో చెప్పారు. 

69మంది నుంచి 

నమూనాల సేకరణ.. నలుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ..

ఇటీవల ఢిల్లీలో జరిగిన సభలో పాల్గొన్న జిల్లాకు చెందిన 103 మందిని గుర్తించిన పోలీసులు వారితోపాటు వారికి సన్నిహితంగా మెలిగిన అందర్నీ క్వారంటైన్‌కు తరలించారు. ఇంతవరకు వారిలో కరోనా లక్షణాలున్న 69మందిలో ఆదివారం నలుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మిగిలిన వారి రిపోర్టు రావాల్సి ఉంది. పాజిటివ్‌ వచ్చిన వారిలో బాలాపూర్‌కు చెందిన ముగ్గురు, హఫీజ్‌పేట్‌కు చెందిన ఒకరు ఉన్నారు. వీరంతా మర్కజ్‌ యాత్రీకులు. వారితో సన్నిహితంగా ఉన్నవారు. ఈ వైరస్‌ ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగంతోపాటు ప్రజాప్రతినిధులు, ప్రజలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులపై ఆరా తీస్తున్న అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి సలహాలు, సూచనలు చేస్తున్నారు. అనుమానిత లు ఎవరైనా ఉంటే వెంటనే కరోనా నిర్ధ్దారణ పరీక్షలు నిర్వహిస్తూ పరిస్థితులను చక్కదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి జిల్లాలో పర్యటించడమే గాక అధికారులతో సమీక్షిస్తున్నారు. మాస్కులు, శానిటైజర్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, ఆశా కార్యకర్తలకు ధైర్యాన్ని కలిగిస్తున్నారు. 

చేగూరుపై ప్రత్యేక నిఘా

చేగూరు గ్రామంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఇక్కడ  766 ఇండ్లలో ఇంటింటి సర్వే నిర్వహిం చి, గ్రామంలోని 2,675మంది ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మొత్తం గ్రామం అష్ట దిగ్బంధం చేసి గ్రామాల పరిసరాలకు ఎవర్నీ రానీయడం లేదు. గ్రామంలో ఎవరికైనా అనుమానం ఉంటే వెంటనే వైద్య సిబ్బంది దృష్టికి తీసుకువస్తున్నారు. ప్రధానంగా గుండెజ బ్బు, షూగర్‌, బీపీ, ఆస్తమా పేషంట్లు, పొగతాగేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మరోవైపు కాన్హాశాంతి వనంలో 818మందికి సంబంధించిన ఆరో గ్య బులెటిన్‌ ప్రతిరోజూ వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ ఉన్న వారంతా హోం క్వారంటైన్‌ పాటిస్తూ బయటకు వెళ్లకుండా చర్యలు చేపట్టారు.


logo