గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - Apr 05, 2020 , 00:28:54

కొత్త రేషన్‌కార్డులు జారీ చేయడం వీలుకాదు

కొత్త రేషన్‌కార్డులు జారీ చేయడం వీలుకాదు

  • డీలర్లు అవకతవకలకు పాల్పడితే చర్యలు 
  • కలెక్టర్‌ పౌసుమి బసు

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : కొత్త రేషన్‌ కార్డుల జారీచేసేందుకు వీలుకాదని, రేషన్‌ డీలర్లు అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని  కలెక్టర్‌ పౌసుమి బసు ‘ డయల్‌ యువర్‌ కలెక్టర్‌ ’ కార్యక్రమంలో తెలిపారు. శనివా రంజిల్లా నుంచి మొత్తం 5 ఫోన్‌ కాల్స్‌ వచ్చాయన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. కొత్తరేషన్‌ కార్డుల విషయమై ఫోన్‌ కాల్‌పై స్పందిస్తూ  ప్రస్తుతం  వీలు పడదన్నారు. ఆలంపల్లిలో రేషన్‌ దుకాణంలో టోకెన్‌ తీసుకున్న కూడా బియ్యం ఇవ్వడం లేదని   తెలుపగా రేషన్‌ డీలర్‌పై విచారణ చేసి   చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నెపల్లి, సాయిబాబా కాలనీలో పారిశుధ్య పనులు సరిగ్గా జరుగడం లేదని తెలుపగా  పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. బొంరాస్‌పేట మండలం గౌరారం సర్పంచ్‌ స్థానికంగా ఉండటం లేదని హైదరాబాద్‌ ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఫోన్‌లో తెలుపగా కలెక్టర్‌ స్పందిస్తూ   చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.  కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌లు మోతిలాల్‌, చంద్రయ్య, డీటీడీవో కోటాజీ, కంట్రోల్‌ రూం ఇన్‌చార్జి పాల్గొన్నారు.


logo