శుక్రవారం 29 మే 2020
Vikarabad - Mar 31, 2020 , 23:28:47

ఢిల్లీ వెళ్లొచ్చిన వారి గుర్తింపు..

ఢిల్లీ వెళ్లొచ్చిన వారి గుర్తింపు..

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఢిల్లీలోని మర్కజ్‌ నిజాముద్దీన్‌ మసీదుకు వెళ్లి వచ్చిన వారిపై జిల్లా యంత్రాంగం నిఘా   జిల్లావ్యాప్తంగా 27మంది ఢిల్లీలో హైపార్థనలకు వెళ్లి వచ్చినట్లు గుర్తించారు. ఈ సంఖ్య మరో ఒకట్రెండు పెరిగే అవకాశాలున్నాయి.  13 మంది మాత్రమే ఢిల్లీ వెళ్లి వచ్చినట్లుగా గుర్తించగా..  సాయంత్రం నాటికి ఆ సంఖ్య 27కు పెరిగింది. వీరిలో వికారాబాద్‌ డివిజన్‌ పరిధిలో 13 మంది, తాండూరు డివిజన్‌లో 10, పరిగి డివిజన్‌లో నలుగురు ఉన్నారు. కాగా  13న  రైళ్లలో, మరికొందరు విమానంలో ఢిల్లీ వెళ్లగా..  ప్రార్థనల అనంతరం  18, 19 తేదీల్లో తిరిగి జిల్లాకు వచ్చారు. నిర్లక్ష్యంతో, భయంతో ఏ ఒక్కరూ అధికారులకు  గోప్యంగా ఉంచారు.   నిజాముద్దీన్‌ మసీదులో ప్రార్థనలో పాల్గొన్న వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్‌ రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ఏయే జిల్లాల నుంచి ఎంత మంది వెళ్లారనే వివరాలను సేకరించాలని కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు  సాయంత్రం నుంచి వివరాలను సేకరిస్తున్న పోలీస్‌,రెవెన్యూ, వైద్యాధికారుల బృందం..  ఢిల్లీ వెళ్లొచ్చిన వారి ఇండ్లకు వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి హోం క్వారంటైన్‌ చేశారు. ప్రస్తుతానికి వారిలో ఎవరికీ కరోనా లక్షణాలు లేకపోవడంతో జిల్లా ఉన్నతాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వీరితోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఇంట్లోనే ఉండాలని, బయటకు ఎవరూ వెళ్లొద్దని సూచించారు. అయితే ఢిల్లీ వెళ్లొచ్చిన అనంతరం వారు ఎవరెవరిని కలిశారు..? ఎక్కడెక్కడికి  సమాచారాన్ని కూడా అధికారులు సేకరిస్తున్నారు. వీరు కలిసిన వారిని కూడా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా హోం క్వారంటైన్‌ చేసేందుకు  ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా ఢిల్లీకి వెళ్లొచ్చినవారు ఎవరితో కలిసి ప్రయాణం, బస చేశారు? పాజిటివ్‌ వచ్చిన వారితో జిల్లాకు చెందిన వారికి ఏమైనా కాంటాక్ట్‌ ఉందా? వారితో కలిసి ప్రయాణించడం, బస చేయడం  వంటి వివరాలను కూడా   

ఔరంగాబాద్‌ వెళ్లొచ్చిన ఇద్దరి గుర్తింపు

బొంరాస్‌పేట : మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో మార్చి రెండో వారంలో జరిగిన మత ప్రచారానికి వెళ్లి వచ్చిన ఇద్దరు యువకులను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు  బొంరాస్‌పేట, తుంకిమెట్ల గ్రామాలకు చెందిన వారి ఇండ్ల వద్దకు డీఎంహెచ్‌వో దశరథ్‌, మండల వైద్యాధికారి రవీంద్ర వెళ్లి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. యువకులతోపాటు వారి కుటుంబ సభ్యులకు క్వారంటైన్‌ ముద్రలు వేసి  రోజులు ఇంట్లోనే ఉండాలని సూచించారు. 

పరిగిలో ముగ్గురు..

పరిగి, నమస్తే తెలంగాణ : ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన  పట్టణానికి చెందిన ముగ్గురి  వద్దకు అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రయ్య, తహసీల్దార్‌ విద్యాసాగర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ తేజిరెడ్డి వెళ్లి వివరాలు సేకరించారు. వారితోపాటు కుటుంబ సభ్యులకు వైద్యుల సమక్షంలో పరీక్షలు చేశారు. హోం  ఉండాలన్నారు.logo