గురువారం 13 ఆగస్టు 2020
Vikarabad - Mar 26, 2020 , 23:52:52

నిర్లక్ష్యమే ప్రాణం తీస్తది

నిర్లక్ష్యమే ప్రాణం తీస్తది

  • మార్కెట్‌లో జనాన్ని చూసి ఆగ్రహం 
  • సామాజిక దూరం పాటించాలి
  • నిత్యవసర వస్తువులకు రేట్లు పెంచితే చర్యలు తప్పవు
  • ఎమ్మెల్సీ మహేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి

తాండూరు, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ను కొందరు సక్రమంగా పాటించక పోవడంతో తమకు తామే ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితులు దాపరిస్తున్నాయని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి ఆగ్రహం వ్య క్తం చేశారు. పండ్లు, కూరగాయల కోసం ఉదయం 6 నుంచి 9గంటల వరకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌ లో వేల మంది ప్రజలు ఒకరికి ఒకరు దూరాన్ని పాటించకుండా గుమిగూడి క్రయవిక్రయాలు జరుపడంతో వ్యాపారులు, ప్రజలపై ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఆగ్ర హం వ్యక్తం చేశారు. వెంటనే దూరాన్ని పాటించి క్రయవిక్రయాలు జరుపాలని సూచిస్తూ సున్నంతో డబ్బాలను వేయించారు. అదే విధంగా కూరగాయల కేంద్రా న్ని సందర్శించిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పండ్లు, కూరగాయలతో పాటు నిత్యవసర వస్తువులకు రేట్లు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భం గా నేతలు, అధికారులు మాట్లాడుతూ కరోనా నియమనిబంధనలు పాటించకుండా యథేచ్ఛగా ప్రజ లు మార్కెట్‌కు రావడం పద్దతి కాదన్నారు. నేనొక్కడినే రోడ్లపైకి వస్తే ఎమవుతుందని అందరూ అలా అనుకోని బయటకు రావడంతో రద్దీ పెరుగుతోందన్నారు. నిర్లక్ష్యం చేసి తమకు తామే ప్రాణాలు తీసుకోరాదని సూచించారు. కూరగాయలు కొనే సమయంలో దూరంగా ఉంటూ తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. స్థానిక నేతలు, అధికారులు, పోలీసులు ఈ విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు.  

సర్పంచ్‌ మృతిపై ఎమ్మెల్సీ సంతాపం

యాలాల : యాలాల మండలం తిమ్మాయిపల్లి సర్పంచ్‌ అపర్ణ మృతి చెందడంతో ఎమ్మెల్సీ మహేందర్‌ రెడ్డితో పాటు టీఆర్‌ఎస్‌ నాయకులు ఆమె మృతికి సంతాపం తెలిపారు. సర్పంచ్‌ అంత్యక్రియల నిమిత్తం కేపీఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రూ. 10వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. 

9గం. తరువాత గడప దాటని జనం

తాండూరు టౌన్‌ : తాండూరు పట్టణంలో కట్టడి ఆంక్షలకు అలవాటుపడిన ప్రజలు ఇంటి గడప దాటడం లేదు. ఐదో రోజు గురువారం తాండూరు పట్టణంలో లాక్‌డౌన్‌ ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం 6గంటల నుంచి 9గంటల వరకు నిర్ణీత ఆంక్షలు విధించడంతో ప్రజలు ఆ సమయంలో మాత్రమే నిత్యవసర సరుకుల కొనుగోళ్లకు బయటకు వచ్చారు. మెడికల్‌ షాపుల వద్ద ప్రజలు సామాజిక దూరాన్ని పాటించి కావాల్సిన మందులను కొనుగోలు చేశారు. 


logo