మంగళవారం 20 అక్టోబర్ 2020
Vikarabad - Mar 25, 2020 , 23:23:08

కలిసొచ్చిన కఠినం..

కలిసొచ్చిన కఠినం..

  • నాలుగో రోజు బయటకు రాని జనం
  • లాక్‌డౌన్‌కు ఫలించిన అధికారుల చర్యలు
  • పరిగిలో నిత్యావసర  సరుకుల కోసం క్యూ..

తాండూరు టౌన్‌/ పరిగి, నమస్తే తెలంగాణ :  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు అధికారులు తీసుకున్న కఠిన చర్యలు కలిసొచ్చాయి. నాలుగో రోజు  కొనసాగిన లాక్‌డౌన్‌లో జనాలు బయటకు అడుగుపెట్టలేదు. కరోనా కట్టడికి తీసుకున్న కఠిన చర్యలు ఫలించడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. బుధవారం ఉదయం నిత్యావసరుకులకు ప్రజలు మార్కెట్‌కు భారీగా తరలివచ్చారు. బసవన్నకట్ట, మున్సిపల్‌ ముందు కూరగాయల దుకాణాలు కిక్కిరిసి పోయాయి. 

ప్రశాంతంగా లాక్‌డౌన్‌

పరిగి, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రకటించిన లాక్‌డౌన్‌ బుధవారం మూడో రోజు ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం 6గంటల నుంచి 9గంటల వరకు సడలింపుతో ప్రజలు నిత్యావసర వస్తువులు, పాలు, పండ్లు, కూరగాయలు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా దుకాణాల వద్ద వినియోగదారుల రద్దీ కనిపించింది. కొన్ని దుకాణాల వద్ద మూడు అడుగులకు ఒకరు చొప్పున నిలబడేందుకు ప్రత్యేకంగా డబ్బాలు ఏర్పాటు చేయడంతో దూరంగా నిలబడి సరుకులు కొనుగోలు చేశా రు. శుద్ధి చేయబడిన నీటి కోసం సైతం బారులు తీరారు. మరోవైపు కూరగాయల ధరలు పెంచారని వినియోగదారు లు పేర్కొంటున్నారు. బుధవారం పరిగిని సందర్శించిన అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రయ్య పారిశుద్ధ్య పనులు పరిశీలించడంతో పాటు పలు దుకాణాల వద్ద వినియోగదారులను కలిసి కరోనా కట్టడికి అందరూ సహకరించాలని కోరా రు. బస్టాండ్‌, రోడ్డు పక్కన ఉండే యాచకుల కోసం మున్సిపల్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ చైర్మన్‌ ముకుంద అశోక్‌ భోజనం అందజేశారు.

కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి

పెద్దేముల్‌ : కరోనా వైరస్‌ నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలని తహసీల్దార్‌ శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం మండల పరిధిలోని మన్‌సాన్‌పల్లిలో దూరప్రాంతాల నుంచి గ్రామానికి వచ్చిన ఏడుగురికి కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి వివరిస్తూ, తగు జాగ్రత్తలు పాటించాలని తెలుపుతూ వైద్య సిబ్బందితో కలిసి వారి చేతులకు హోమ్‌ క్వారంటైన్‌(గృహ నిర్భంధ) ముద్రను వేశారు. అదే విధంగా మండల కేంద్రంలో దుబాయ్‌ నుంచి వచ్చి గృహ నిర్బంధంలో ఉన్న వ్యక్తికి కరోనా వైరస్‌ రాకుం డా పాటించాల్సిన నియమాలను వివరించి కర పత్రాన్ని అందించారు. 

మల్కాపూర్‌లో పలువురికి వైద్య పరీక్షలు

తాండూరు రూరల్‌ : బతుకు దెరువు కోసం ఇతర రాష్ర్టాలకు వెళ్లి వచ్చిన వారికి  వైద్య సిబ్బం ది పరీక్షలు జరిపినారు. బుధవారం తాండూరు మండలం మల్కాపూర్‌లో 25 మం దికి వైద్య పరీక్షలు జరిపారు. ఆంధ్రా, తమిళనాడు, కర్నాటక, మహారాష్ర్టల నుంచి సుమారు 55మంది వచ్చారు. వారికి వైద్య సిబ్బంది పరీక్షలు చేశారు. ఎటువంటి వ్యాధి లక్షణాలు లేవని వైద్యులు తెలిపారు. అయినా 14రోజుల పా టు స్వీయ నిర్బంధంలో ఉండాలని మెడికల్‌ సూపర్‌వైజర్‌ వెంకటేశం తెలిపారు.

కరోనా వైరస్‌ కట్టడికి చర్యలు 

కులకచర్ల : కులకచర్ల మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు కరోనా వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మండ ల పరిధిలోని రాంపూర్‌, ఇప్పాయిపల్లి, ముజాహిద్‌పూర్‌, కులకచర్ల, బిందెంగడ్డతండాలో సరిహద్దుల రోడ్లకు ముళ్లకంచెను ఏర్పాటు చేశారు.

సొంత ఇండ్లకు చేరుకుంటున్న వలస కుటుంబాలు

బషీరాబాద్‌ : ముంబయి, పూనే, హైదరా బాద్‌, తదితర ప్రాంతాలకు బ్రతుకు దెరువు కోసం వెళ్లిన కుటుంబాలు వారి వారి సొంత గ్రామాలకు చేరుకుంటుండంతో గ్రామాల, తండాల ప్రజలు చేరుకుంటున్నారు. బ్రతుకు దెరువు కోసం వెళ్లిన ప్రజలు ఇండ్లకు రావడంతో కరోనా నివారణ టీం గ్రామాలకు, తండాలకు వెళ్లి వారిని పరీక్షించి ఇళ్లలోనే ఉండాలని సూచిస్తున్నారు. ముంబయి, పూనేలో ఉన్న వాళ్లు మోటర్‌ సైకిళ్లపై సొంత గ్రామాలకు, తండాలకు చేరుకుంటున్నారు. కొంత మంది మహారాష్ట్ర సరిహద్దును వదిలిపెడితే నడు చుకుంటు వచ్చినట్లు తండా ప్రజలు తెలిపారు. రెండు మూడు రోజుల్లో వివిధ తండాలకు చెంది న 250మంది వచ్చినట్లు ఆయా తండా సర్పం చ్‌లు పేర్కొన్నారు. 

నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తులపై కేసు నమోదు

యాలాల్‌ : ‘కరోనా’ను కట్టడి చేస్తున్న భాగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన నిబంధనలను ఉల్లంఘించి గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌ నుంచి యాలాల మండలం రాస్నం గ్రామానికి వచ్చిన వ్యక్తులపై కేసు నమోదు చేసిన ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ కథనం ప్రకారం.. రాస్నం గ్రామానికి చెందిన అజర్‌ జీవనోపాధి కోసం అహ్మదాబాద్‌కు వెళ్లి టైలర్‌ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అజర్‌ తన సొంత గ్రామానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తనకు తెలిసిన వ్యక్తులను 12మందిని అహ్మదాబాద్‌ నుంచి రాస్నంకు తీసుకువచ్చాడు. కరోనా వైరస్‌ ప్రాబల్యంతో  ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో  భారత్‌తో సహా అన్ని రాష్ర్టాల్లో లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడకు రావడంతో వారికి సహకరించి వారిని తీసుకువచ్చిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు యాలాల ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు.


logo