సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Mar 22, 2020 , 23:39:52

కందుల @ 18,720 మెట్రిక్‌ టన్నులు

కందుల  @ 18,720 మెట్రిక్‌ టన్నులు

  • ముగిసిన కందుల సేకరణ
  • జిల్లాలో 9  ద్వారా కొనుగోళ్లు
  • 20  మంది రైతులకు ప్రయోజనం
  • రైతుల ఖాతాల్లో పది రోజుల్లో డబ్బులు జమ

తాండూరు, నమస్తే తెలంగాణ : జిల్లాలో ఈ ఏడాది కందుల కొనుగోళ్లు 21వ తేదీతో ముగిశాయి. ప్రత్యేక తెలంగాణ   ఏర్పడ్డాక కందులకు మద్దతు ధర బాగుండడంతో ఈసారి జిల్లా వ్యాప్తంగా 52,376.4 హెక్టార్ల కంది సాగైంది.  వానలు సకాలంలో కురవడంతో పంట దిగుబడులు బాగున్నాయి.  పంటకు రూ. 5800 మద్దతు ధర కల్పిస్తు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి.   జిల్లా వ్యాప్తంగా తొమ్మిది కొనుగోళ్ల కేంద్రాల్లో 1,87,200 క్వింటాళ్ల కందులను ప్రభుత్వం సేకరించింది.  అధికారులు పకడ్బందీ చర్యలు కారణంగా  ఇరవై వేల మందికి పైగా రైతులకు ప్రయోజనం చేకూరింది. గత ఏడాది క్వింటాలు కందులకు రూ.5675 పలుకగా ఈ ఏడాది రూ. 125 పెంచి క్వింటాలు కందులను రూ.5800లకు తీసుకోవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఆయా కొనుగోలు కేంద్రం పరిధిలోకి వచ్చే గ్రామాల రైతులకు వారి కందులు ఏరోజు కొనుగోలు చేస్తామనే విషయాన్ని ముందుగా ప్రకటించడంతో అదే రోజు రైతులు తమ పంటను తీసుకువచ్చి కొనుగోలు కేంద్రంలో అమ్మకాలు జరిపారు. విక్రయించిన 10 నుంచి 25 రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి. రైతుల నుంచి సేకరించిన కందులను వెంటనే గోదాములకు తరలించారు. 

ఇబ్బందులు లేకుండా అధికారుల చర్యలు..

దళారులు మద్దతు ధర కేంద్రంలో కందులు విక్రయించకుండా ఈ ఏడాది అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద కందులు, ధాన్యం చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. మొదట్లో ఆన్‌లైన్‌ ద్వారా ఇబ్బందులు ఎదుర్కొన్న రైతుల ఇబ్బందులకు వెంటనే స్పందించి గ్రామాల వారిగా తేదీలను కేటాయించి రైతులు పండించిన పంటకు ఎలాంటి నిబంధనలు లేకుండా కొనుగోలు చేశారు. ఎప్పటికప్పుడు మండల స్థాయి అధికారులతో పాటు జిల్లా, రాష్ట్ర, విజిలెన్స్‌ బృందాలు కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు అన్యాయం జరుగకుండా చర్యలు తీసుకున్నారు.  

కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాం

జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది మార్క్‌ఫెడ్‌, నాఫెడ్‌ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు  పకడ్బందీగా చేపట్టాం.  నిబంధనలు రైతులకు అనుగుణంగా మార్చడంతో  వారు  తమ పంటను కొనుగోలు కేంద్రంలో విక్రయించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ఖాతాల్లో డబ్బులు కూడ త్వరగా వేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఏడాది జిల్లా వ్యాప్తంగా 20 వేల రైతుల నుంచి 18720 మెట్రిక్‌ టన్నుల కందులను సేకరించాం. 

-  జ్యోతి,  మార్క్‌ఫెడ్‌ డీఎంlogo