ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Mar 22, 2020 , 23:35:27

ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌..

ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌..

  • ప్రజా రవాణా బంద్‌
  • మద్యం దుకాణాలు మూసివేత
  • ప్రజలు ఇండ్లల్లోనే  సీఎం కేసీఆర్‌ 
  • కొనసాగనున్న అత్యవసర సేవలు
  • అందుబాటులో మెడికల్‌ హాళ్లు, పాలు, కూరగాయల మార్కెట్లు

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌పై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. ఇటలీ దేశ ప్రజల దుస్థితి రాకుండా కరోనా మహామ్మారిని తరిమికొట్టేందుకు ఈ నెలాఖరు వరకు రాష్ట్రమంతటా లాక్‌డౌన్‌ అమల్లో ఉండనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెళ్లడించారు. అత్యవసర సేవ లు మినహా మిగతా అన్ని పూర్తిగా బంద్‌ కానున్నా యి. లాక్‌డౌన్‌ దృష్ట్యా ప్రజలెవరూ కూడా ఇండ్ల నుంచి బయటకు రావొద్దని, జనతా కర్ఫ్యూ స్ఫూర్తిగా అందరూ ఇండ్లకే పరిమితమై, ప్రతి ఒక్కరూ 3మీటర్ల దూరాన్ని పాటిస్తూ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా సహకరించాలని ప్రభుత్వం కోరింది. మరోవైపు ప్రజలేవరికి ఇబ్బందులు కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నెల 31వర కు లాక్‌డౌన్‌ కొనసాగనున్న దృష్ట్యా అత్యవసర సరుకుల కోసం కుటుంబం నుంచి ఒక్కరూ మాత్రమే ఇంటి నుంచి బయటకు రావాలని ప్రభుత్వం సూచించింది. మెడికల్‌ హాళ్లు, కూరగాయల మార్కెట్లు, పాలు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

అదే విధంగా ప్రజలకు నెలకు సరిపడా బియ్యం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తెల్ల రేషన్‌కార్డులన్న కుటుంబంలోని ఒక్కొక్కరికి 12కిలోల చొప్పున బియ్యం ఉచితంగా అందించడంతో పాటు రేషన్‌కార్డులున్న కుటుంబాలకు నిత్యావసర సరుకుల నిమిత్తం రూ. 1500అందించేందుకు నిర్ణయించింది. ఎక్కడా కూడా ఐదుగురికి మించి ప్రజలెవరూ గుమికూడదని హెచ్చరించారు. అంతేకాకుండా ప్రజారవాణా వ్యవస్థ ఈ నెల 31 వరకు బంద్‌ కానుంది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు బంద్‌కానున్నా యి. అంతరాష్ట్ర సరిహద్దు నుంచి ఏ ఒక్కరూ రాకుం డా సరిహద్దును పూర్తిగా మూసివేయనున్నారు. విద్యాసంస్థలు మూసివేయడంతో పాటు అత్యవసర ప్రభు త్వ కార్యాలయాలు మినహా మిగతా అన్ని కార్యాలయాలన్ని మూసివేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేట్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు లాక్‌డౌన్‌ రోజు ల వేతనాన్ని చెల్లించాలని, అంగన్‌వాడీ కేంద్రాలు కూడా ఈ నెలాఖరు వరకు మూతపడనున్నాయి. ఈ నెలలో కాన్పులు జరిగే గర్భిణుల జాబితాను గుర్తించి, వారికి సేవలందించేందుకు సంబంధిత సిబ్బందిని ఆదేశించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరోవైపు మద్యం దుకాణాలను ఈ నెల 31వరకు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.


logo